గురువారం 26 నవంబర్ 2020
Komarambheem - Sep 20, 2020 , 03:00:28

రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

  •  జడ్పీ అధ్యక్షురాలు కోవ లక్ష్మి

ఆసిఫాబాద్‌ టౌన్‌(వాంకిడి) : రైతుల సంక్షేమానికి ప్రభు త్వం పెద్దపీట వేస్తున్నదని జడ్పీ అధ్యక్షురాలు కోవలక్ష్మి పేర్కొన్నారు. వాంకిడి ఎంపీడీవో  కార్యాలయంలో శనివారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రైతుబంధు, రైతుబీమా సంక్షేమ పథకాలను రైతులకు అందించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఇప్పుడు రైతులు ఒకచోట చేరి చర్చించుకోవడానికి రైతువేదిక నిర్మాణాలను చేపట్టిందన్నారు. ప్రజల కోసం ప్రవేశపెట్టిన  సంక్షేమ పథకాలను నేరుగా వారికి చేరేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మండలంలోని అన్ని క్లస్టర్లలో రైతువేదికల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలన్నారు. కరోనా రోజురోజుకూ విజృంభిస్తున్నందున గ్రామాల్లో శానిటైజేషన్‌ చేయాలని సూచించారు. అంతకు ముందు మండలంలోని వివిధ శాఖల అధికారులు తమ శాఖల్లో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రణాళికలను చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో డీపీవో రమేశ్‌, ఎంపీడీవో వెంకటేశ్వర్‌ రెడ్డి, జడ్పీటీసీ అజయ్‌, ఎంపీపీ విమలా బాయి, సింగిల్‌విండో చైర్మన్‌ పెంటు, అధికారులు పాల్గొన్నారు.