బుధవారం 21 అక్టోబర్ 2020
Komarambheem - Sep 19, 2020 , 02:20:46

షెడ్యూల్డ్‌ కులాల అభ్యున్నతికి కృషి చేయాలి

షెడ్యూల్డ్‌ కులాల అభ్యున్నతికి కృషి చేయాలి

  • n  ప్రతినెలా నివేదికలు అందించాలి
  •  n  పెండింగ్‌ కేసులను వెంటనే పరిష్కరించాలి
  •  n  ఎస్సీ, ఎస్టీ మానిటరీ కమిటీ   సమావేశంలో కలెక్టర్‌ భారతీ హోళికేరి

హాజీపూర్‌ :  షెడ్యూల్డ్‌ కులాల అభ్యున్నతికి కృషి చేయాలని కలెక్టర్‌ భారతీ హోళికేరి అన్నారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో బెల్లంపల్లి ఆర్డీవో, జిల్లా ఖజానా అధికారి, షెడ్యూల్డ్‌ కులాలు, పోలీస్‌, మున్సిపల్‌ శాఖల అధికారులు, దళిత సం ఘాల నాయకులతో శుక్రవారం ఎస్సీ, ఎస్టీ మానిటరీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై రివ్యూ చేశామన్నారు. ప్రతినెలా 30న మండల స్థాయిలో నిర్వహించే సివిల్‌ రైట్స్‌డే పౌర హక్కుల దినోత్సవంలో 16 శాఖల అధికారుల ఆధ్వర్వంలో సమావేశం ఏర్పాటు చేసుకొని నివేదికలు అం దించాలన్నారు. ప్రతి కేసు ప్రొసీజర్‌ ప్రకారం వెళ్లాలని, పోలీ స్‌, రెవెన్యూ శాఖలోని భూముల సమస్యలు, అట్రాసిటీ కేసు లు పెండింగ్‌లో ఉంటే వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అట్రాసిటీ కేసుల నమోదు, నష్టపరిహారం చెల్లింపులు బాధితులకు సక్రమంగా అందడంతో పాటు సమగ్ర న్యాయం జరిగేలా చూడాలన్నారు. బెల్లంపల్లి ఆర్డీవో శ్యామలాదేవి, జిల్లా షెడ్యూల్డ్‌ కులాల శాఖ అధికారి రవీందర్‌ రెడ్డి, జిల్లా ఖజానా శాఖ అధికారి సరోజ, బెల్లంపల్లి ఏసీపీ రహెమాన్‌, జైపూర్‌, మంచిర్యాల ఏసీపీలు, మున్సిపల్‌ కమిషనర్‌ స్వరూప, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సభ్యులు జిల్లపల్లి వెంకటేశం, రేణికుంట లింగయ్య, అంజయ్యతో పాటు దళిత సంఘాల నాయకులు,  అధికారులు పాల్గొన్నారు.

ఉద్యానవన అభివృద్ధి పథకం ద్వారా  రాయితీలు

సమీకృత ఉద్యానవనశాఖ అభివృద్ధి మిషన్‌ ద్వారా ప్రభుత్వం వార్షిక ప్రణాళిక ఖరారు చేసిందని కలెక్టర్‌ భారతీ హోళికేరి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో  ఉద్యానవన, అనుబంధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో రూ.6.27 లక్షలతో 34. 60 హెక్టార్లలో పండ్ల తోటలు పెంచనున్నట్లు తెలిపారు. జిల్లా లో 25 హెక్టార్లలో మామిడి , జామ 4.80, బొప్పాయి 4.80 హెక్టార్లలో పెంచేలా ప్రణాళిక రూపొందించారు. కూరగాయ లు, పూల తోటలకు 20 హెక్టార్లకు 50 శాతం రాయితీతో రూ. 3.20 లక్షలు వెచ్చించనున్నారు. యాంత్రీకరణ కింద రూ. 7.75 లక్షలతో చిన్న, సన్నకారు రైతులు, ఎస్టీ, ఎస్సీ రైతులకు 50 శాతం, ఇతరులకు 40 శాతం రాయితీపై 8 చిన్న ట్రాక్టర్లు, 10 బ్రష్‌ కట్టర్లు పంపిణీ చేయనున్నారు. అలాగే రైతు విజ్ఞాన యాత్రలకు రూ. 66 వేలు, ట్రాక్టర్‌ మౌంటెడ్‌ స్ప్రేయర్‌ 18కి  గాను రూ. 10.47 లక్షలను 50 శాతం సబ్సిడీతో అందించనున్నారు. 12 ఎకరాల బొప్పాయికి  రూ.4. 35 లక్షలు ఖర్చు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. మూడో ఏడాది రాయితీ కింద మామిడి 16.80 హెక్టార్లకు రూ.55 వేలు, జామ 3  హెక్టార్లకు రూ.18వేలు, రేగుపండు 2.40 హెక్టార్లకు రూ.7 వేలు చెల్లించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల రైతులు మంచిర్యాల, చెన్నూర్‌, బెల్లంపల్లి నియోజకవర్గాల ఉద్యానవన శాఖ అధికారులను సంప్రదించాలన్నారు. రాయితీ కోసం జన్నా రం, దండేపల్లి, లక్షేట్టిపేట, హాజీపూర్‌, నస్పూర్‌ రైతులు కే సహజ 7997725416, బెల్లంపల్లి, తాండూర్‌, కన్నెపల్లి, భీమిని, నెన్నెల, వేమనపల్లి, కాసిపేట రైతులు సీహెచ్‌ సుప్రజ 7997725034, మందమర్రి, జైపూర్‌, భీమారం, చెన్నూర్‌, కోటపల్లి రైతులు ఆర్‌ తిరుపతి 799772 5029   సంప్రదించాలని సూచించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి వీరయ్య, ముఖ్య ప్రణాళికాధికారి సత్యనారాయణ రెడ్డి, జడ్పీ సీఈవో నరేందర్‌, ఉద్యానవన శాఖ అధికారి యుగేందర్‌ పాల్గొన్నారు.logo