గురువారం 29 అక్టోబర్ 2020
Komarambheem - Sep 19, 2020 , 02:20:47

కులవృత్తులకు సమన్యాయం

కులవృత్తులకు  సమన్యాయం

  •  ప్రపంచ వెదురు దినోత్సవంలో  జడ్పీ అధ్యక్షురాలు కోవ లక్ష్మి

ఆసిఫాబాద్‌ టౌన్‌ : తెలంగాణ ప్రభుత్వంలో అన్ని కులవృత్తులకు సమన్యాయం జరుగుతున్నదని జడ్పీ అధ్యక్షురాలు కోవ లక్ష్మి అన్నారు. ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భం గా శుక్రవారం  తన నివాసంలో  మేదరి సంఘం నాయకులతో కలిసి కేకే కట్‌ చేశారు. అనంతరం  ఆవరణలో వెదురు మొక్క నాటారు. ఈ సందర్భంగా  ఆమె మాట్లాడుతూ అ న్ని కులవృత్తుల వారు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం అ నేక పథకాలు అమలు చేస్తున్నాదన్నారు. సంఘం నాయకు లు పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లగా, పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అంతకుముందు సం ఘం నాయకులు ఆమెకు శాలువా కప్పి సన్మానించారు. కా ర్యక్రమంలో మేదరి సంఘం జిల్లా అధ్యక్షుడు రాజమల్లు, నాయకులు నరేశ్‌, రాములు పాల్గొన్నారు.