ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Komarambheem - Aug 10, 2020 , 00:08:25

జిల్లా కేంద్రంలో ఘనంగా ఆదివాసుల దినోత్సవం.

జిల్లా కేంద్రంలో ఘనంగా ఆదివాసుల దినోత్సవం.

కెరమెరి : ఆదివాసుల సంక్షేమమే సర్కారు ధ్యేయమని జడ్పీ అధ్యక్షురాలు కోవలక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసుల అ భ్యున్నతి కోసం పోరాడిన అమరవీరుడు కుమ్రం భీం చిత్ర ప టానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గిరిజనులకు రెవెన్యూ భూములతో పాటు అటవీ భూములకు సైతం రైతుబంధు పథకాన్ని అమలు చేసి పెట్టుబడి సహాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి దిలీప్‌కుమార్‌, ఆదివాసీ సంఘం జాతీయ నాయకుడు సిడాం అర్జు, ప్రధాన్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు పెందోర్‌ సుధాకర్‌, రాజ్‌గోండ్‌ సేవా సమితి జిల్లా అధ్యక్షుడు కేశవ్‌రావు, జిల్లా సార్‌మేడి కిషన్‌రావు, జీసీడీవో శకుంతల, ఆదివాసీ నాయకులు జయంతి, చంపావతి, మాణిక్‌రావు, రఘు, శంకర్‌, సందీప్‌కుమార్‌ పాల్గొన్నారు.    

కెరమెరి : ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు మండలంలో ఘనంగా జరుపుకున్నారు. కరోనా వైరస్‌ ప్రభావం వల్ల సర్కార్‌ విధించిన నియమాలను పాటిస్తూ గ్రామాల వారీగా ఎక్కడివారు అక్కడే జెండాలను ఆవిష్కరించి సంబురాలు జరుపుకొన్నారు. ఈ కార్యక్రమంలో కుమ్రం భీం ఉత్సవ కమిటీ చైర్మన్‌ పేందోర్‌ రాజేశ్వర్‌, ఆదివాసీ సీనియర్‌ నాయకుడు ఆత్రం లక్ష్మణ్‌రావు, సర్పంచ్‌లు కుమ్రం నానేశ్వర్‌, జగ్‌న్నాథ్‌రావు, భీంరావు, నాయకులు కర్ణు, దందురావు, మోహన్‌రావు, రఘునాథ్‌, తదితరులు పాల్గొన్నారు.

బెజ్జూర్‌ : సులుగుపల్లి, బారెగూడ, సులుగుపల్లి తదితర గ్రామాల్లో ప్రపంచ ఆదివాసీల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో ఆదివాసీ జేఏసీ మండలాధ్యక్షుడు సిడాం సకారం కుమ్రం భీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ జేఏసీ జిల్లా కన్వీనర్‌ సోయం చిన్నయ్య, మండల ఉపాధ్యక్షుడు కే తిరుపతి, ఆదివాసీ కోయ సంఘం జిల్లా అధ్యక్షుడు మధూకర్‌, సర్పంచ్‌లు కే స్వప్న, కే హన్మం తు, గిరిజన నాయకులు పురుషోత్తం, కే రమేశ్‌, కే విశ్వేశ్వర్‌, మాజీ సర్పంచ్‌ సుగుణ, గిరిజన ఉపాధ్యాయ సంఘ సభ్యు లు, ఉద్యోగ సంఘాల సభ్యులు  పాల్గొన్నారు. 

 సిర్పూర్‌(టి) : మండలకేంద్రంలోని గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల ఆవరణలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షుడు సిడాం చంద్రమోహన్‌ ఆధ్వర్యంలో ఆదివాసీ నాయకులు కుమ్రం భీం విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఆనంతరం భీం విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు తలండి ప్రవీణ్‌, మడావి వెంకటేశ్‌, శైలేశ్‌, మాధవ్‌, అజయ్‌, గంట అశోక్‌, పెందోర్‌ వామన్‌ పాల్గొన్నారు.   

రెబ్బెన : మండలంలోని ఇందిరానగర్‌ సమీపంలోని భీమన్న ఆలయం వద్ద ఆదివాసీల దినోత్సవాన్ని ఆదివాసీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆదివాసీ సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి ఏ సుధాకర్‌ స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంఘం మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌, ప్రధానకార్యదర్శి పోచమల్లు, ప్రచార కార్యదర్శి వెంకటేశ్‌, దుర్గం తిరుపతి, తదితరులు పాల్గొన్నారు. 

కౌటాల : మండల కేంద్రంలోని కుమ్రం భీం చౌరస్తాలో ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆదివాసీలు ఆదివాసీ జెండాను ఆవిష్కరించి, కుమ్రం భీం విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రాజ్‌గోండ్‌ సేవా సమితి జిల్లా అధ్యక్షుడు, డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌ కుమ్రం మాంతయ్య, ఆదివాసీ మన్నేవార్‌ సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీ పోశం, జిల్లా అధ్యక్షుడు ఎం బ్రహ్మయ్య, అధికార ప్రతినిధి సదాశివ్‌, ఎడ్ల తిరుపతి, గావుడే హన్మంత్‌, మడావి పోచాని, ఏ ప్రభాకర్‌, అశోక్‌, సాయినాథ్‌ తదితరులున్నారు. 

పెంచికల్‌ పేట : మండల కేంద్రంలో ఆదివాసీ సంఘం మండల అధ్యక్షుడు ఏ లస్మయ్య జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షడు తలండి మధూకర్‌, ప్రధాన కార్యదర్శి అశోక్‌, సర్పంచ్‌ పీ మధునయ్య, మండల ప్రధాన కార్యదర్శి ఆలం సకారాం, మాజీ సర్పంచ్‌ బుజంగరావు, సభ్యులు చంద్రశేఖర్‌, శ్రీనివాస్‌, భాస్కర్‌, తదితరులు పాల్గొన్నారు.  

జైనూర్‌ : మండలంలోని మార్లవాయిలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ వెంకటేశ్వర్‌రావు, టీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కనక వెంకటేశ్వర్‌రావు, గ్రామ పటేల్‌ ఆత్రం బోజ్జు, గ్రామ పెద్దలు గణపత్‌రావు, కే మోతీరాం, దేవ్‌రావు, కే ఆనంద్‌రావు, గోవింద్‌, నాగమణి, భీంరావు, చంద్రకళ, సావిత్రి, తదితరులు ఉన్నారు.


logo