ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Komarambheem - Aug 09, 2020 , 02:06:43

జల పాతాల వద్ద జాగ్రత్తలు పాటించాలి

జల పాతాల వద్ద జాగ్రత్తలు పాటించాలి

తిర్యాణి : విహార యాత్రలు విషాదరకంగా మారకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని ఎస్‌ఐ పీ రామారావు పేర్కొన్నారు. శనివారం మండలంలో ని చింతల మాదర, గుండాల జలపాతల వద్ద పోలీసుల ఆధ్వర్యంలో సూచిక, హెచ్చరిక బోర్డు పెట్టించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ అందమైన జలపాతాలు ఆకట్టుకోవడం సహజమేనని పేర్కొన్నారు. కానీ తగిన జాగ్రత్తలు పాటించకపోవడంతో విహార యాత్రలు విషాదాన్ని మిగులుస్తాయని తెలిపారు. గతేడాది చింతల మాదర, ఈ యే టా గుండాల జలపాతాల వద్ద ప్రమాదాలు చోటు చేసుకున్నాయని గుర్తు చేశారు. ఆయన వెంట పోలీ స్‌ సిబ్బంది ఉన్నారు.logo