బుధవారం 30 సెప్టెంబర్ 2020
Komarambheem - Aug 03, 2020 , 01:52:58

ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలి

ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలి

ఆసిఫాబాద్‌ : ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని, అనవసరంగా  బయటికి రావద్దని కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా వైద్యాధికారి కుమ్రం బాలు సూచించారు. జిల్లాలో ఆదివారం మరో 14 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ధ్రువీకరించారు. ఆసిఫాబాద్‌లో 10,  లింగాపూర్‌లో 2, కాగజ్‌నగర్‌లో 2 కేసులు నమోదైనట్లు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు జిల్లాలో మొత్తుం 115 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. ప్రజలు కరోనా వైరస్‌ నుంచి రక్షించుకోవాలంటే భౌతిక దూరం పాటించాలని, బయటికి వచ్చినప్పుడు తప్పని సరిగా మాస్కులు ధరించాలని సూచించారు.

బెల్లంపల్లి టౌన్‌  : పట్టణంలో ఆదివారం మరో నలుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిం ది. శాంతిఖని గనిలో విధులు నిర్వహిస్తున్న 24 డీప్‌ ఏరియాకు చెందిన సింగరేణి కార్మికుడికి, బెల్లంపల్లి బస్తీకి చెందిన ఓ ప్రైవేట్‌ దవాఖాన ల్యాబ్‌ టెక్నీషియన్‌కు, రైల్వే రడగంబాల బస్తీకి చెందిన మాజీ కౌన్సిలర్‌కు, ఆర్కే-1 గనిలో విధు లు నిర్వహిస్తూ బూడిదగడ్డ బస్తీలో నివసిస్తున్న మరో  సింగరేణి కార్మికుడికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. సంబంధిత అధికారులు ఈ నాలుగు ఏరియాలను కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించారు. బారీకేడ్లు ఏర్పాటు  చేసి రాకపోకలను నిషేధించా రు. పారిశుద్ధ్య సిబ్బంది సోడియంహైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేశారు. ఏఎస్‌ఐ లింగన్న, వైద్యాధికారి నరేశ్‌,  సిబ్బంది ఉన్నారు. 

మంచిర్యాల రూరల్‌ (హాజీపూర్‌) : హాజీపూర్‌ మండలంలో  ఓ ప్రజాప్రతినిధి తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు. సదరు ప్రజాప్రతినిధి తల్లిదండ్రులకు జ్వరం రావడంతో దవాఖానలో పరీక్షలు చేయగా పాజిటివ్‌ వచ్చినట్లు పేర్కొన్నారు. దీంతో వారికి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ దవాఖానలో చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.

తాజావార్తలు


logo