మంగళవారం 11 ఆగస్టు 2020
Komarambheem - Jul 29, 2020 , 01:56:40

ప్రణాళికాబద్ధంగా పట్టణాభివృద్ధి

ప్రణాళికాబద్ధంగా పట్టణాభివృద్ధి

నిర్మల్‌/మంచిర్యాల/కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ : ఉమ్మ డి ఆదిలాబాద్‌ జిల్లాలోని పన్నెండు మున్సిపాలిటీలపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సమీక్ష చేశా రు. ముందుగా నిర్మల్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లోని నా లుగు బల్దియాలు, అనంతరం మంచిర్యాల, కు మ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లోని ఎనిమిది పురపాలక సంఘాలపై సమీక్ష నిర్వహించారు. ఈ  సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుపరిపాలన అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ ముం దుకెళ్తున్నారని.. ఆ దిశగా పరిపాలన వికేంద్రీకరణ చేశారన్నారు. మున్సిపాలిటీల పురోగతికి ఓ అభివృద్ధి నమూనా తయారు చేసుకోవాలన్నారు. దీని ఆధారంగానే అభివృద్ధి ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. ప్రజల ప్రాథమిక అవసరా లు తీర్చడమే లక్ష్యంగా పురపాలన కొనసాగాలన్నా రు. రోడ్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, పచ్చదనం వంటి వాటిపై దృష్టి పెట్టాలన్నారు. కొత్త పురపాలక చట్టం నిర్దేశించిన విధులను కచ్చితంగా అమలు చేయాలన్నారు. పట్టణ ప్రగతి లక్ష్యాల్లో భాగంగా హరితహారంలో విరివిగా మొక్కలు నాటాలని.. గ్రీన్‌ బడ్జెట్‌లో 10 శాతం నిధులను పచ్చదనం పెంపునకు కేటాయించి పార్కు ల అభివృద్ధి, నర్సరీలను ఏర్పాటు చేయాలన్నారు.

అధికారులు ఆకస్మిక తనిఖీలు చేయాలి..

వెజ్‌ - నాన్‌, వెజ్‌ ఇంటిగ్రేటెడ్‌ మోడల్‌ మార్కె ట్లు, అన్ని వసతులతో కూడిన వైకుంఠధామాలను ఏర్పాటు చేయాలన్నారు. స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లు, జం తువుల సంరక్షణ కేంద్రం, బయోలాజికల్‌, బయో మెడికల్‌ వ్యర్థాలు, కన్‌స్ట్రక్షన్‌, వేస్టేజ్‌ నిర్వహణ కూ డా చేపట్టాలన్నారు. మాంసం, కోళ్లు, చేపల అమ్మకందార్లతో సమావేశం పెట్టి.. వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు సకాలంలో జీ తాలు చెల్లించాలని.. వారికి అవసరమైన దుస్తులు, బూట్లు, మాస్కులు ఆయా మున్సిపాలిటీలే అందించాలన్నారు. అన్ని మున్సిపాలిటీల్లో ప్రతి 1000 మందికి ఒక టాయిలెట్‌ ఉండేలా చూడాలని.. ఇం దులో 50 శాతం షీటాయిలెట్లు ఉండాలన్నారు. మున్సిపల్‌ చైర్మ న్లు, కమిషనర్లు ఉదయం 5:30 గంటలకే ఫీల్డ్‌లో ఉండాలని.. ఆకస్మిక పర్యటనలు చేయాలన్నారు. చెత్త సేకరణ ప్రతిరోజూ జరగాలని, తడి-పొడి చెత్తను విడిగా సేకరించాలన్నా రు. అవసరమున్న చోట్ల రోడ్లు ఊడ్చే యంత్రాలను కొనుగోలు చేయాలని కలెక్టర్లకు సూచించారు. ఈ సం దర్భంగా ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు అం బులెన్స్‌లు అందిస్తామని మంత్రి కేటీఆర్‌కు తెలిపా రు. ఎమ్మెల్యేలు జోగు రామన్న, విఠల్‌రెడ్డి, దివాకర్‌రావు, రేఖానాయక్‌, దుర్గం చిన్నయ్య ఒక్కొక్కరు ఒక్కో అంబులెన్స్‌ చొప్పున అందిస్తామని ముందుకొచ్చారు. వారిని కేటీఆర్‌ అభినందించారు. సమావేశంలో ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, పెద్దపల్లి ఎం పీ వెంకటేశ్‌ నేతకాని, ఎమ్మెల్యేలు కోనే రు కోనప్ప, నడిపెల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, గడ్డిగారి విఠల్‌రెడ్డి, అజ్మీరా రేఖానాయక్‌, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్‌, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టర్‌ సత్యనారాయణ, నాలుగు జిల్లాల కలెక్టర్లు ముషారఫ్‌ అలీ ఫారూఖీ, సిక్తా పట్నాయక్‌, భారతీ హోళికేరి, సందీప్‌కుమార్‌ ఝా, మున్సిపల్‌ చైర్మన్లు, కమిషనర్లు పాల్గొన్నారు. 

నిర్మల్‌ పట్టణాభివృద్ధిపై కేటీఆర్‌ కితాబు

నిర్మల్‌ మున్సిపాలిటీలో చేపడుతున్న అభివృద్ధి పనులపై కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. దీంతో నిర్మల్‌ మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు బాగున్నాయ ని.. మంత్రి కేటీఆర్‌ ఈ సందర్భంగా కితాబు ఇచ్చా రు. నాలాల పూడికతీత, రోడ్ల విస్తరణ, సెం ట్రల్‌ లైటింగ్‌, డివైడర్‌ విధానం, పట్టణంలో చేపట్టిన ఇత ర అభివృద్ధి పనులు, నిర్మాణాలపై కేటీఆర్‌ అభినందించారు. నిర్మల్‌ తరహాలోనే భైంసా, ఖానాపూర్‌ మున్సిపాలిటీలను అభివృద్ధి చేపట్టాలన్నారు. 


logo