బుధవారం 05 ఆగస్టు 2020
Komarambheem - Jul 27, 2020 , 02:06:02

రైతు వేదికలు వేగిరం

రైతు వేదికలు వేగిరం

కుమ్రం భీం ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ : వ్యవసాయ రంగాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకు నియంత్రిత సాగు విధానాన్ని అమలు చేస్తున్న ప్ర భుత్వం రైతులను సంఘటితం చేసి సమష్టి నిర్ణయా లు తీసుకునేందుకు రైతు వేదికల నిర్మాణానికి శ్రీకా రం చుట్టింది. జిల్లాలోని 70 క్లస్టర్లలో 70 వేదికల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నది. వీటిని త్వర గా పూర్తిచేసేలా శాఖల వారీగా బాధ్యతలను అప్పగించింది. అక్టోబర్‌ నాటికి రైతు వేదికలను పూర్తిచేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.  

శాఖల వారీగా నిర్మాణ బాధ్యతలు..

నిర్మాణాలను త్వరగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీని కోసం శాఖల వారీ గా బాధ్యతలను అప్పగించారు. గిరిజన సంక్షేమ శాఖ, ఆర్‌ అండ్‌ బీ, పంచాయితీ రాజ్‌, టీఎస్‌ఈడ బ్ల్యూ ఐడీసీ శాఖలకు పనులను అప్పగించారు. జైనూర్‌, సిర్పూర్‌-యు, లింగాపూర్‌, తిర్యాణి, కెరమెరి మండలాల్లో 19 రైతు వేదికల పనులను గిరిజన సంక్షేమ శాఖకు అప్పగించారు. సిర్పూర్‌-టి, కౌటాల, వాంకిడి మండలాల్లోని 18 రైతు వేదికల ను ఆర్‌ అండ్‌ బీ శాఖకు, ఆసిఫాబాద్‌, రెబ్బె న, పెం చికల్‌పేట్‌, దహేగాం, కాగజ్‌నగర్‌ మండలాల్లోని 23 రైతు వేదికలను పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ శాఖకు, చింతలమానేపల్లి, బెజ్జూర్‌ మండలాల్లోని 10 రైతు వేదికల నిర్మాణ బాధ్యతలను టీఎస్‌ఈడబ్ల్యూడీసీ శాఖకు అప్పగించారు. జిల్లాలో 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్‌ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ప్రతి క్లస్టర్‌లో ఒక రైతు వేదికను నిర్మిస్తున్నది. ఒక్కొ క్క రైతు వేదిక రూ. 22 లక్షలతో చేపడుతున్నది. జిల్లాలో ఇప్పటికే సుమారు 30 రైతు వేదికల నిర్మాణాలకు స్థానిక ప్రజాప్రతినిధులు శంకుస్థాపన చేశా రు. గ్రామాల్లో రైతులు ఒక చోట చేరి విత్తనాలు వేసే దగ్గరి నుంచి పంటలను అమ్ముకునే వరకు వివిధ అంశాలను చర్చించుకునేందుకు అనువుగా నిర్మాణాలను చేపట్టనున్నారు. మండల వ్యవసాయ విస్తరణ అధికారి అందుబాటులో ఉండనున్నారు. దీంతోపాటు భూసార పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలోని 70 రైతు వేదికలను అక్టో బర్‌ కల్లా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.


logo