శుక్రవారం 14 ఆగస్టు 2020
Komarambheem - Jul 24, 2020 , 04:23:52

సింగరేణి ఆధ్వర్యంలో హరితహారం

సింగరేణి ఆధ్వర్యంలో హరితహారం

రెబ్బెన: హరితహారంలో అందరూ భాగస్వాములవ్వాలని ఆసిఫాబాద్‌ జడ్పీ అధ్యక్షురాలు కోవ లక్ష్మి, ఎమ్మెల్యే అత్రం సక్కు ప్రజలకు పలుపునిచ్చారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో గోలేటి కోల్‌ హ్యాండీలింగ్‌ పంప్‌ (సీహెచ్‌పీ)లో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొ ని మొక్కలు నాటారు. సింగరేణి సంస్థ కోటి మొక్క లు నాటే కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగించడం అభినందనీయమన్నారు. ఇందులో భాగంగా బెల్లంపల్లి ఏరియాలో యేటా లక్షల్లో మొక్కలు నాటి సంరక్షణ బాధ్యతలు తీసుకుంటున్నదన్నారు. రా ష్ట్రంలో 23 శాతం ఉన్న అడవులను పెంచాలనే లక్ష్యంతో కేసీఆర్‌ ఈ మహాయజ్ఞాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. బెల్లంపల్లి ఏరియా జీఎం కొండయ్య మాట్లాడుతూ సింగరేణి సీఅండ్‌ఎండీ శ్రీధర్‌ ఆదేశాల మేరకు 2 లక్షల మొక్కలు నాటినట్లు పేర్కొన్నా రు. అనంతరం ప్రజా ప్రతినిధులకు మొక్కలు బ హుమతిగా ఇచ్చారు. బెల్లంపల్లి ఏరియా జీఎం కొం డయ్య, తహసీల్దార్‌ రియాజ్‌అలీ, ఎఫ్‌ఆర్‌వో పూర్ణి మ, ఎస్‌ఐ దీకొండ రమేశ్‌, ఎంపీపీ జుమ్మిడి సౌంద ర్య, సర్పంచ్‌లు పొటు సుమలత, బుర్స పోశమల్లు, ఉప సర్పంచ్‌ దేవానంద్‌, ఎంపీటీసీ శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు పొటు శ్రీధర్‌రెడ్డి, టీబీజీకేఎస్‌ ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాసరా వు, సింగరేణి ఆధికారులు ఎస్‌వోటూజీఎం సాయిబాబు, పీఎం లక్ష్మణ్‌రావు, డీవైపీఎం రామశాస్త్రి, ప్రాజెక్టు ఆధికారులు శ్రీరమేశ్‌, చంద్రశేఖర్‌, డీజీఎంలు యోహన, విశ్వనాథ్‌, శివరామిరెడ్డి(సివిల్‌), శివరామిరెడ్డి(ఈఅండ్‌ఎం) పాల్గొన్నారు. 


logo