బుధవారం 12 ఆగస్టు 2020
Komarambheem - Jul 23, 2020 , 01:31:54

పార్టీ భవనం ప్రారంభానికి ఏర్పాట్లు

పార్టీ భవనం ప్రారంభానికి ఏర్పాట్లు

ఆసిఫాబాద్‌ : టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయ భవనాన్ని ఆగస్టులో ప్రారంభించేందుకు ఏర్పా ట్లు చేస్తున్నట్లు కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జడ్పీ అధ్యక్షురాలు కోవ లక్ష్మి తెలిపారు. జిల్లా కేంద్రం లో బుధవారం ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జడ్పీ అధ్యక్షురాలు కోవ లక్ష్మి మా ట్లాడుతూ.. పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడంలో భాగంగా టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రతి జిల్లాలో కార్యాలయాలు నిర్మించేందుకు ఏర్పాట్లు చేశారన్నారు. రూ.60 లక్షలతో ఎకరం స్థలంలో భవనం నిర్మిస్తున్నట్లు చెప్పారు. 1000 నుంచి 1500 మంది కూర్చునేలా సమావేశ మందిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల మీడియా సమావేశాలు, నియోజకవర్గ స్థాయి ముఖ్యులతో సమావేశాలు జరుపుకునేలా మరో భవనం ని ర్మించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని భవనాలను ఆగస్టులోనే ప్రారంభించేందుకు పార్టీ నిర్ణయించిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు గాదెవేణి మల్లేశ్‌, మార్కె ట్‌ కమిటీ చైర్మన్‌ చిలువేరు వెంకన్న, నాయకులు సాలం, అశోక్‌, తదితరులు పాల్గొన్నారు.


logo