శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Komarambheem - Jul 22, 2020 , 01:32:50

నిర్మాణ పనుల్లో అలసత్వం వద్దు

నిర్మాణ పనుల్లో అలసత్వం వద్దు

కెరమెరి: పల్లె ప్రకృతి వనం, శ్మశాన వాటిక, రైతు వే దిక భవన నిర్మాణ పనుల్లో అలసత్వం వద్దని ఆసిఫాబాద్‌ కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అధికారులకు సూ చించారు. మండలంలోని ధనోరా గ్రామంలో నిర్మించే రైతు వేదిక భవన నిర్మాణ స్థలానికి అటవీ శాఖ అధికారులు అభ్యంతరం తెలుపడంతో వివాదం నెలకొంది. తహసీల్దార్‌ గోడం సంతోష్‌ కుమార్‌తో కలిసి కలెక్టర్‌ మంగళవారం స్థలాన్ని పరిశీలించారు. రికార్డుల ఆధారంగా సర్వే నంబర్‌ 8లో ప్రభుత్వ భూమిగా మ్యాప్‌లో ఉన్నందున నిర్మాణ పనులకు అంతరాయం ఏర్పడదని సూచించారు. అనంతరం సాంగ్వీ, ఖైరి, కెస్లాగూడ, అ నార్‌పల్లి గ్రామాల్లో పర్యటించారు. సాంగ్వీలో నిర్మించే శ్మశాన వాటిక, ప్రకృతి వనం స్థలాలు పరిశీలించేందుకు కిలో మీటరు కాలినడకన వెళ్లారు. కలెక్టర్‌ మాట్లాడు తూ.. అడవికి దగ్గర ప్రకృతి వనం నిర్మించవద్దని, పిల్ల లు అక్కడికి వెళ్లేందుకు ఇబ్బందిగా మారుతుందని చె ప్పారు. ఈ విషయంపై గ్రామ పంచాయతీలో గ్రామసభ నిర్వహించి అందుబాటులో ఉండే స్థలాన్ని గుర్తించాలని సూచించారు. ఎంపికైన ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టి దసరా వరకు పనులు పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. ఎవ్వరూ బహిర్భూమికి బయటకు వెళ్లకుండా ఇంటి ఆవరణలో మరుగుదొడ్లు నిర్మించుకునే లా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

ఆప్యాయంగా పలకరిస్తూ..

గ్రామాల్లో పర్యటించిన కలెక్టర్‌ చిన్న, పెద్దా తేడాలేకుండా అందరినీ పలకరిస్తూ ఓపికగా సమస్యలు విన్నా రు. పింఛన్‌ రావడం లేదని వృద్ధులు కలెక్టర్‌కు విన్నవిం చారు. ఆధార్‌ కార్డులు, ఇతర వివరాలు సేకరించి వెంట నే పరిష్కరించేలా చూస్తానని భరోసా ఇచ్చారు. పిల్లల తో కూడా సరదాగా ముచ్చటించారు. మాస్కులు లేకుం డా బయటికి రావద్దని సూచించారు. ఎంపీపీ పేందోర్‌ మోతీరాం, తహసీల్దార్‌ గోడం సంతోష్‌ కుమార్‌, ఎంపీడీవో మహేందర్‌, ఎస్‌ఐ రమే శ్‌, ఏవో గోపీకాంత్‌, వైస్‌ ఎంపీపీ అబుల్‌ కలాం, ఏపీవో నగేశ్‌, ఎంపీటీసీ స క్కారాం, సర్పంచ్‌ మడావి చిలుక, ఆర్‌ఎస్‌ఎస్‌ మం డల కోఆర్డినేటర్‌ బాలాజీ, నాయకులు సయ్యద్‌ రిజ్వా న్‌, కేశవ్‌, మధూకర్‌, కార్యదర్శులు ఉన్నారు. 


logo