ఆదివారం 09 ఆగస్టు 2020
Komarambheem - Jul 22, 2020 , 01:28:09

సమస్యల పరిష్కారానికి రైతు వేదికలు

సమస్యల పరిష్కారానికి రైతు వేదికలు

జైనూర్‌ : రైతులంతా ఒక్క చోట సమస్యలను చర్చించుకొని పరిష్కరించుకునేందుకు రైతు వేదికలు ఎంతో ఉపయోగపడుతాయని కుమ్రం భీం ఆసిఫాబాద్‌ కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అన్నారు. జైనూర్‌ మండలంలోని రాసిమెట్ట, సిర్పూర్‌(యు) మండలంలోని మహాగాం, పంగి డి గ్రామాల్లో మంగళవారం రైతు వేదిక భవనాల స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. భవనాల నిర్మాణంలో నాణ్య త పాటించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా వెంట సిర్పూర్‌(యు) తహసీల్దార్‌ నదీముల్లాఖాన్‌, ఎంపీడీవో మధుసూదన్‌, ఎంపీపీ తొడసం భాగ్యలక్ష్మి, వైస్‌ ఎంపీపీ ఆత్రం ప్రకాశ్‌, జామ్ని ఎంపీటీసీ లట్పటె మహదవ్‌, నాయకులు మెస్రం అంబా జీ, కుమ్రం దుందేరావ్‌, సర్పంచ్‌ ఆత్రం వీణబాయి, తదితరులున్నారు.

కరోనా వ్యాప్తిపై అప్రమత్తంగా ఉండాలి..

ఆసిఫాబాద్‌ టౌన్‌ : జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తిపై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా సూచించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మంగళవారం సంబంధిత అధికారులతో కరోనా వ్యాప్తిపై సమీ క్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సోడియం హైపోక్లోరైట్‌ పిచికారీ చే యించాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో జి ల్లా కేంద్రంలోని పలు కాలనీల్లో హెల్త్‌ సర్వే నిర్వహించాలని సూచించారు. అలాగే గోలేటి క్వారంటైన్‌ కేంద్రంలో 41 మంది, వాంకిడి క్వారంటైన్‌లో 24 మంది, కాగజ్‌నగర్‌ క్వారంటైన్‌లో 54 మంది ఉన్నట్లు తెలిపారు. హోం క్వారంటైన్‌లో ఉన్నవారు కుటుంబ సభ్యులకు దూరంగా, ప్రత్యేక గదుల్లో ఉండాలని సూచించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌ రాంబాబు, రెవెన్యూ అధికారి సురేశ్‌, ఆర్డీవో సిడాం దత్తు, జిల్లా వైద్యాధికారి కుమ్రం బాలు, డీటీడీవో దిలీప్‌, డీపీవో రమేశ్‌, సీఐ అనిల్‌, సూపరింటెండెంట్‌ కాత్యాయని, తదితరులు పాల్గొన్నారు.


logo