సోమవారం 03 ఆగస్టు 2020
Komarambheem - Jul 13, 2020 , 01:29:10

సామాజిక సేవాదృక్పథంతో ముందుకెళ్లాలి...

సామాజిక సేవాదృక్పథంతో ముందుకెళ్లాలి...

ఆసిఫాబాద్‌ టౌన్‌ : సామాజిక సేవాదృక్పథంతో ముందుకు సాగాలని జడ్పీ చైర్‌ పర్సన్‌ కోవలక్ష్మి సూచించారు. ఆదివారం హిందూవాహిని ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైకుంఠధామాన్ని పట్టణంలోని సందీప్‌నగర్‌ శివాలయం వద్ద ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎవరైనా మృతి చెందినప్పుడు వారిని వైకుంఠధామానికి తీసుకు వెళ్లేందుకు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉం దన్నారు. బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆత్మారాం నాయక్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు మల్లేశ్‌, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ సీహెచ్‌ వెంకన్న, యువకులు ప్రతాప్‌, కార్తీక్‌ ఉన్నారు.

కుమ్రం భీం ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ : రైతు వేదికల ద్వారా సమగ్ర వ్యవసాయ విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. లాభదాయకమైన పంటలను పండించి రైతులను ఆర్థికంగా అభివృద్ధి చేసేదిశగా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భా గంగా జిల్లాలోని  ప్రతి క్లస్టర్‌లో రైతు వేదికల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.  ఇప్పటికే స్థ లాల సేకరణ పూర్తయ్యింది. ఇటీవలే జిల్లాలోని పలుమండలాల్లో రైతు వేదికల నిర్మాణాలకు జడ్పీ అధ్యక్షురాలు కోవలక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి భూమి పూజ  చేసి పనులు ప్రారంభించారు.

నియంత్రిత సాగువైపు..

ఈ వానకాలం నుంచి  ప్రభుత్వం నియంత్రిత సాగు పద్ధతులను ప్రవేశపెట్టి రైతులను లాభదాయకమైన పంటల వైపు మళ్లిస్తోంది. గ్రామంలోని రైతులు ఒకే చోట సాగు విధానాలు, వ్యవసాయ మార్పులపై చర్చించుకునేందుకు వీలుగా ఈ వేదికలను ఏర్పా టు చేస్తోంది. జిల్లాలోని 15 మండలాల పరిధిలో 70 క్లస్టర్లు ఉండగా,  ఇప్పటికే  అధికారులు అందుబాటులో ఉన్న 10 నుంచి 15 గుంటల స్థలాన్ని  గుర్తించారు. త్వరలోనే మి గిలిన చోట్ల కూడా పనులు ప్రారంభించేందు కు చర్యలు తీసుకుంటున్నారు. రైతులు దుక్కిదున్నిన నాటి నుంచి పంటలను అమ్ముకునే వరకూ అన్ని రకాల సేవలను అందించేందు కు ఇవి ఎంతోగానో ఉపయోగపడనున్నాయి. 

రూ. 15లక్షలతో..

ఒక్కో రైతు వేదిక భవనాన్ని రూ 15 లక్షలతో నిర్మించనున్నారు. ఇందులో ఏఈవో కార్యాలయంతో పాటు భూసార పరీక్షలు చేసేందుకు ల్యాబ్‌ ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా విశాలమైన  హాలు, ఇతర వసతులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇవి పూర్తయితే వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులకు నిరంతరం అందుబాటులో ఉండనున్నారు. 

రైతులకు సలహాలు, సూచనలు

పంటల సాగులో రైతులకు సూచనలు, సలహాలు ఇవ్వడంతో పాటు ప్రభుత్వ పథకాలు, రాయితీ విత్తనాలు, శిక్షణ, భూసార పరీక్షలు, ఎరువుల పంపిణీ వంటి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు రైతులకు తెలియజేయనున్నా రు. క్లస్టర్‌ పరిధిలోని సాగు, రైతుల వివరాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటాయి.  
logo