శుక్రవారం 14 ఆగస్టు 2020
Komarambheem - Jul 13, 2020 , 01:08:41

పులిని సూడంగనే పాణాలు పోయినయ్‌..

పులిని సూడంగనే పాణాలు పోయినయ్‌..

బెజ్జూర్‌ : మావోళ్లు ఇంట్ల సామాన్లు అయిపోయినయ్‌ బెజ్జూర్‌కు పోయి తీసుకురా అని చెప్పిన్రు. ఆదివారం పొద్దుగాల మా దోస్తు మడావి మధూకర్‌తో బండి మీద బెజ్జూర్‌కు పోయిన. అక్కడ అన్నీ కొనుక్కున్నం. 10 గంటలకు తిరిగి ఇంటికి వస్తున్నం. బెజ్జూర్‌ అడవిలోకి సొచ్చినం. మానిక్‌దేవర(మాన్కమ్మ) తల్లి వద్దకు రాంగనే చెట్లళ్ల నుంచి పెద్దపులి మా ముందే దూకింది. ఇగ మా కండ్లు బైర్లు కమ్మినయ్‌. బండిమీది నుంచి పడ్డం. లేచి తలోదిక్కు ఉరికినం. నాకు కాలు, చేయికి దెబ్బ తాకింది. మా సోపతికి కూడా చిన్నగా తగిలినయ్‌. కొంచెం సేపు అయినంక అక్కడికి పోయి చూసినం. పులి కనిపించలే. ఇగ బండి తీసుకొని బెజ్జూర్‌ దవాఖానకు పోయినం. డాక్టర్లు మందులిచ్చిన్రు. ఎఫ్‌ఆర్వో దయాకర్‌ సార్‌ వచ్చి చూసిపోయిండు. పులిని సూడంగనే ఇగ మా పాణాలు పోయినయ్‌ అనుకున్నం. ఆ  తల్లే మమ్ముల కాపాడింది.


logo