మంగళవారం 04 ఆగస్టు 2020
Komarambheem - Jul 11, 2020 , 01:07:29

రూర్బన్‌ పనులను పూర్తిచేయాలి

రూర్బన్‌ పనులను పూర్తిచేయాలి

ఆసిఫాబాద్‌ : పెండింగ్‌లో ఉన్న రూర్బన్‌ పనులను పూర్తి చేయాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా అన్నారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సంబంధితశాఖల అధికారులతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. పాఠశాలల్లో నీటి, సోలార్‌ విద్యుత్‌ సౌకర్యం కల్పించాలని డీఈవోను ఆదేశించారు. జిల్లా కేంద్రంలో సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టంను త్వరగా పూర్తి చేయాలని అర్‌అండ్‌బీ డిప్యూటీ ఈఈకి తెలిపారు. ఆసిఫాబాద్‌ పట్టణంలో పిల్లల ఉద్యానవనం, బూరుగూడలోని పశువైద్య ఉప కేంద్రం, మిగిలిన అంగన్‌వాడీ కేంద్రాల ఆధునీకరణ పనులు పూర్తి చేయాలని సూచించారు. అదనపు విద్యుత్‌ లైన్లు త్వరలో పూర్తి చేయాలన్నారు. సమావేశంలో డీఆర్డీవో వెంకట శైలేష్‌, డీపీవో రమేశ్‌, పీఆర్‌ ఈఈ వెంకట్రావ్‌, డీఈవో పాణిని, తదితరులు పాల్గొన్నారు.

కాగజ్‌నగర్‌ టౌన్‌ : విశాఖపట్టణం నుంచి న్యూఢిల్లీ వెళ్లే రైలులో కాగజ్‌నగర్‌కు వచ్చిన ప్రయాణికులకు పీహెచ్‌సీ వైద్య సిబ్బంది శుక్రవారం థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించారు. కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా, జిల్లా వైద్యాధికారి కుమ్రం బాలు ఆదేశాల మేరకు 36 మంది ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మున్సిపల్‌ చైర్మన్‌ సద్దాం హుస్సేన్‌ రైల్వేస్టేషన్‌ను సందర్శించారు.  కార్యక్రమంలో డీఏవో పర్మల్‌ భౌమిక్‌, వైద్య సిబ్బంది కోటేశ్వర్‌, హనీసుద్దీన్‌, రవిదాస్‌, మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ , రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. 


logo