శుక్రవారం 07 ఆగస్టు 2020
Komarambheem - Jul 11, 2020 , 01:04:38

రైతు సంక్షేమమే సీఎం కేసీఆర్‌ ధ్యేయం

రైతు సంక్షేమమే సీఎం కేసీఆర్‌ ధ్యేయం

కాగజ్‌నగర్‌ రూరల్‌ : రైతు సంక్షేమమే సీఎం కేసీఆర్‌ ధ్యేయమని సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. మండలంలోని వంజీరి గ్రామ పంచాయతీ పరిధిలోని చెక్‌పోస్టు సమీపంలో రైతు వేదిక నిర్మాణానికి శుక్రవారం భూ మిపూజ చేశారు. కాగజ్‌నగర్‌ మండలంలో నాలుగు క్లస్టర్ల లో రైతు వేదికల నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. రై తులకు వ్యవసాయ సమాచారం కోసం ఇబ్బందులు లేకుం డా, సమయం వృథా కాకుండా రైతు వేదికలు ఉపయోగపడుతాయన్నారు. రైతులకు అవసరమైన సమ గ్ర సమాచారాన్ని ఈ వేదిక ద్వారా అందించడంతో బహుళ ప్రయోజనాలు కలుగుతాయని పేర్కొన్నారు. నియంత్రిత సాగు విధానంపై రైతులకు పూర్తిగా అవగాహన కల్పిస్తామన్నారు.  కర్షకుల సంక్షేమం కోసమే రైతుబంధు, రైతు బీమా పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు, కౌటాల ఎంపీపీ బసార్కర్‌ విశ్వనాథ్‌, జిల్లా అధికారి రవీందర్‌, ఏడీఏ శ్రీనివాస్‌ రావు, ఏవోలు రామకృష్ణ, మధులత, రాజేశ్‌, పంచాయతీ రాజ్‌ ఏఈ రాజ్‌కుమార్‌, సర్పంచ్‌ రమేశ్‌, ఎంపీటీసీ సంతర్‌, వార్డు సభ్యులు, రైతులు పాల్గొన్నారు.


logo