మంగళవారం 04 ఆగస్టు 2020
Komarambheem - Jul 11, 2020 , 00:57:47

నాటిన మొక్కలను సంరక్షించాలి

నాటిన మొక్కలను సంరక్షించాలి

కాగజ్‌నగర్‌ టౌన్‌ : నాటిన మొక్కలను సంరక్షించాలని మున్సిపల్‌ చైర్మన్‌ సద్దాం హుస్సేన్‌ సూచించారు. పట్టణంలోని వా ర్డు నంబర్‌ 6,20లో మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌, కౌన్సిలర్లతో కలిసి  శుక్రవారం మొక్కలు నా టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ, ప్రతి ఒక్కరూ నాటిన మొక్కలను సంరక్షించాలని సూచించారు. వార్డు కౌన్సిలర్లు జైచందర్‌, మదన్‌ మోహన్‌, మున్సిపల్‌ సి బ్బంది, టీఆర్‌ఎస్‌ నాయకులున్నారు. 

పెంచికల్‌పేట్‌ : హరితహారంలో నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని జడ్పీ సీఈ వో వేణు సూచించారు. మండలంలోని కొండపల్లి, లోడ్‌పల్లి, ఎల్కపల్లి, తదితర గ్రామాల్లో పర్యటించారు. అనంతరం ఆయా గ్రామాల్లో ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని సూచించారు. అలాగే డంప్‌ యార్డు, శ్మశాన వాటిక  నిర్మాణ పనులను పరిశీలించారు.  సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్‌, ఎం పీవో గంగాసింగ్‌, ఏపీవో సతీశ్‌, సర్పంచులు సంజీవ్‌, కావ్య, ఎంపీటీసీ రాజన్న,  నాయకులు  రాజన్న, న గేశ్‌, చౌదరి బండు, తదితరులు పాల్గొన్నారు. 

మొక్కలను నాటించాలి..

బెజ్జూర్‌ : ప్రతి ఇంటి ఆవరణలో మొక్కలు నా టించేలా ఈజీఎస్‌ మేట్‌ చర్యలు చేపట్టాలని  ఏపీవో రామకృష్ణ సూచించారు.  మండల కేంద్రంలోని మండల పరిషత్‌ కా ర్యాలయం లో ఏర్పాటు చేసిన బెజ్జూర్‌ జీపీ మేట్లకు అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.  మురుగు నీరు రోడ్లపై చేరకుండా ఇం కుడు గుంతలు తవ్వించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాజేందర్‌, ఈసీ రజినీకాంత్‌, కార్యదర్శి రవికుమార్‌, ఈజీఎస్‌ సిబ్బంది పాల్గొన్నారు. 


logo