గురువారం 13 ఆగస్టు 2020
Komarambheem - Jul 09, 2020 , 00:59:23

రైతులకు వరం రైతు వేదికలు

రైతులకు వరం రైతు వేదికలు

సిర్పూర్‌(టి)/ కౌటాల: రైతులకు వరం రైతు వేదికలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రవీందర్‌ అన్నారు. రైతు వేదిక నిర్మాణం కోసం సిర్పూర్‌(టి), కౌటాల మండలాల్లో వేర్వేరుగా బుధవారం స్థలాలు పరిశీలించారు. సిర్పూర్‌లో పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో గు ర్తించిన స్థలాన్ని మండల వ్యవసాయాధికారులతో కలిసి పరిశీలించారు. ఇక్కడ ఏడీఏ శ్రీనివాస్‌, ఏవో మధులత, వ్యవసాయ విస్తరణ అధికారులు శ్రీనివాస్‌, కవిత, నేహ తబస్సు మ్‌, శోభారాణి ఉన్నారు. కౌటాల మండల కేంద్రంతోపాటు గుడ్లబోరి, కన్నెపల్లి గ్రామా ల్లో స్థలాలను పరిశీలించారు. అనంతరం ఎం పీడీవో కార్యాలయ ఆవరణలో ఫర్టిలైజర్‌ షాపుల యజమానులతో సమావేశం నిర్వ హించారు. నిర్ణయించిన ధరకే ఎరువులు, పు రుగు మందులను విక్రయించాలని, నిషేధిత గడ్డి మందు అమ్మితే లైసెన్స్‌ రద్దు చేస్తామని హెచ్చరించారు. ప్రతి రైతు వివరాలు తప్పక నమోదు చేయాలని సూచించారు. యజమానుల ఆధ్వర్యంలో డీఏవో, ఏడీఏను శాలువాలతో సన్మానించారు. ఇక్కడ కాగజ్‌నగర్‌ ఏడీఏ శ్రీనివాస రావు, ఏవో రామకృష్ణ, ఆర్‌అండ్‌బీ ఏఈఈ రవికిరణ్‌, ఏఈవోలు అంజన్న, రవి కుమార్‌, వెంకటేశ్‌, తదితరులు పాల్గొన్నారు. 

తాజావార్తలు


logo