సోమవారం 03 ఆగస్టు 2020
Komarambheem - Jul 09, 2020 , 00:57:59

ఆయిల్‌ పామ్‌ సాగుపై దృష్టి సారించాలి

ఆయిల్‌ పామ్‌ సాగుపై దృష్టి సారించాలి

జైపూర్‌: ఆయిల్‌పామ్‌ సాగుపై రైతులు దృష్టి సారించాలని  ప్రభుత్వవిప్‌ బాల్క సుమన్‌ అన్నారు. మండలంలోని కుందారంలో రైతులు బొమ్మెన సమ్మిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి ఏడెకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు చేసేందుకు ముందుకు రాగా, విప్‌ సుమన్‌ బుధవారం భూమి పూజ చేసి మొక్కలు నాటా రు. ఆయిల్‌పామ్‌ ఇండస్ట్రీకి ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు వచ్చినట్లు తెలిపారు. అనంతరం కిష్టాపూర్‌, కుందారంలో రైతు వేదికల నిర్మాణాలకు భూమిపూజ చేశారు.  టేకుమట్ల వాగుపై చెక్‌డ్యాం నిర్మాణంతో గ్రామంలోని 300 ఎకరాలకు సాగునీరు అందుతుందని సుమన్‌ తెలిపారు. రూ. 3.6 కోట్లతో వాగుపై నిర్మించనున్న చెక్‌డ్యాం నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం గ్రామంలో రైతువేదిక నిర్మాణానికి భూమిపూజ చేశారు.  

వైద్య సిబ్బంది లేకుంటే ఎలా.. ?  

కుందారం ప్రభుత్వ వైద్యశాలను విప్‌ బాల్క సుమన్‌  మధ్యాహ్నం 3 గంటల సమయంలో సందర్శించేందుకు వెళ్లగా తాళం వేసి ఉంది. దీంతో ఆయన జిల్లా వైద్యాధికారి నీరజతో ఫోన్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఆమె అందుబాటులోకి రాకపోవడంతో జిల్లా కలెక్టర్‌కు ఫోన్‌ చేసి మాట్లాడారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో దవాఖానలో సిబ్బంది లేకుంటే ఎలా అని ప్రశ్నించారు. వైద్యశాలలో పని చేస్తున్న 16 మందికి షోకాజ్‌ నోటీసులు ఇవ్వాలని తెలిపారు. కార్యక్రమాల్లో  జడ్పీటీసీ మేడి సునీత, ఎంపీపీ రమాదేవి, సర్పంచ్‌ గోనె సుమలత, ఎంపీటీసీ బడుగు రవి, సింగిల్‌విండో చైర్మన్‌ గుండు తిరుపతి, చెన్నూ ర్‌ మార్కెట్‌ కమిటీ ఉపాధ్యక్షుడు గూడెల్లి శ్రీనివాస్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి సురేందర్‌రెడ్డి,  సర్పంచ్‌లు చందుపట్ల పద్మజ, ఇజ్జగిరి సమ్మయ్య, ఎంపీటీసీలు రాజేశ్వరి, సతీశ్‌, పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

చెన్నూర్‌ రూరల్‌ :  మండలంలోని సుబ్బరాంపల్లిలో వైస్‌ ఎంపీపీ వెన్నపురెడ్డి  బాపురెడ్డి పదెకరాల్లో ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ సాగు చేయడానికి  ముందుకు వచ్చాడు. విప్‌ బాల్క సుమన్‌ మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీపీ మంత్రి బాపు, జడ్పీటీసీ మోతె తిరుపతి, వైస్‌ ఎంపీపీ వెన్నపురెడ్డి బాపురెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు దామోదర్‌ రెడ్డి, ఎంపీడీవో మల్లేశం, ఇరిగేషన్‌ ఏఈ దామోదర్‌, సర్పంచ్‌లు తోట మధుకర్‌, అమృత, ఎంపీటీసీలు, పాల్గొన్నారు.  

బాధిత కుటుంబాలకు పరామర్శ

కోటపల్లి : మండలకేంద్రానికి చెందిన టీఆర్‌ఎస్‌ నాయకుడు నేరెళ్ల రామన్న భార్య విజయలక్ష్మి ఇటీవల మృతి చెందగా ఆ కుటుంబాన్ని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌ కుమార్‌ బుధవారం పరామర్శించారు. రైతుబంధు సమితి కోఆర్డినేటర్‌ గుర్రం రాజన్న తండ్రి మల్లయ్య ఇటీవల మరణించగా ఆ కుటుంబాన్ని ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌ కుమార్‌, మాజీ విప్‌ నల్లాల ఓదెలు, ఎంపీపీ మంత్రి సురేఖ, వైస్‌ ఎంపీపీ వాల శ్రీనివాస్‌ రావు, పీఏసీఎస్‌ చైర్మన్‌ సాంబాగౌడ్‌, నాయకులు పరామర్శించారు. మృతుల చిత్రపటాల వద్ద నివాళులర్పించి, సంతాపం తెలిపారు. 

సబ్‌ సెంటర్‌ నూతన భవనం ప్రారంభం

మందమర్రి రూరల్‌ : అందుగులపేట ప్రాథమిక ఉప ఆరోగ్య కేంద్రం నూతన భవనాన్ని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ ప్రారంభించారు. మండలంలో మొత్తం 10 ప్రాథమిక ఉప ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయని వైద్యాధికారి శైలజ, కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌ తెలిపారు.  అందుగులపేట సబ్‌ సెంటర్‌లో ఇద్దరు ఏఎన్‌ఎంలు ఉంటారని ఈ సెంటర్‌ను స్థానికులు ఉపయోగించుకోవాలని కోరారు. 


logo