మంగళవారం 11 ఆగస్టు 2020
Komarambheem - Jul 08, 2020 , 01:34:30

జోరుగా హరితహారం

జోరుగా  హరితహారం

చెన్నూర్‌: హరితహారం కార్యక్రమం పట్టణంలో ముమ్మరంగా కొనసాగుతున్నది. మంగళవారం పలు వార్డుల్లో కౌన్సిలర్లు మొక్కలు నాటి, ఇంటింటికీ పంపిణీ చేశారు. 

మంచిర్యాల అగ్రికల్చర్‌ : పట్టణంలోని 29వ వార్డులో లయన్స్‌ క్లబ్‌ జిల్లా చైర్మన్‌ కే సత్యపాల్‌ రెడ్డి ఆధ్వర్యంలో మంచిర్యాల హైటెక్‌ సిటీ లయన్స్‌ క్లబ్‌, గౌతమీ లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ గర్మిళ్ల సభ్యులు మంగళవారం 200 మొక్కలు నాటారు. కార్యక్రమంలో లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు కొత్త సురేందర్‌ రావు, నామని రమేశ్‌ కుమార్‌, సంపత్‌, కార్యదర్శులు మడుపు రాంప్రకాశ్‌, రమేశ్‌, ఆర్సీ కృష్ణమూర్తి, జేడీ వీరస్వామి, బోడకుంట రాజమౌళి, సభ్యులు పీ వెంకటేశ్వర్‌ రావు, విశ్వేశ్వర్‌ రావు, ఆసం ప్రసాద్‌, దుర్గం రాజేశం గౌడ్‌, హరితహారం ఇన్‌చార్జి శశిరేఖ పాల్గొన్నారు.

జైపూర్‌: రామారావుపేటలో సర్పంచ్‌ నామాల సత్యవతి వార్డు సభ్యులతో కలిసి గ్రామంలోని రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటారు. అనంతరం స్థానిక నర్సరీలో గ్రామస్తులకు మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ పెద్దల బాపు, నాయకులు పాల్గొన్నారు. 

కోటపల్లి : పారుపల్లిలో ఎక్సైజ్‌ అధికారులు హరితహారం నిర్వహించారు. చెన్నూర్‌ ఎక్సైజ్‌ ఎస్‌ఐ లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో గ్రామంలో ఈత మొక్కలు నాటారు. కార్యక్రమంలో సర్పంచ్‌ పూరెళ్ల వెంకట లక్ష్మి, కార్యదర్శి తాజొద్దీన్‌, ట్రైనీ ఎస్‌ఐ శ్రీనివాస్‌, ఎక్సైజ్‌ సిబ్బంది హరీశ్‌, సంతోష్‌, నారాయణ, రాజేందర్‌, స్రవంతి పాల్గొన్నారు.

చెన్నూర్‌ రూరల్‌ : మండలంలోని చాకెపల్లిలో సర్పంచ్‌ ఆకుదారి పోసక్క   గ్రామస్తులకు మొక్కలు పంపిణీ చేశారు. అనంతరం శ్మశాన వాటిక, డంప్‌ యార్డు నిర్మాణ పనులను పరిశీలించారు. 


logo