మంగళవారం 11 ఆగస్టు 2020
Komarambheem - Jul 05, 2020 , 23:26:41

పర్యావరణాన్ని రక్షిద్దాం

పర్యావరణాన్ని రక్షిద్దాం

కెరమెరి:  అందరం కలిసి మొక్కలు నాటుదామని, పర్యావరణాన్ని రక్షిద్దామని  ఎంపీపీ పేందోర్‌ మోతీరాం, ఎంపీడీవో మహేందర్‌ ప్రజలకు  విజ్ఞప్తి చేశారు.. ఆరో విడుత హరితహారంలో భాగంగా ఆదివారం మండలంలోని సాక్డ గ్రామంలో  సర్పంచ్‌ కాసుబాయి తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ, చెట్లు లేకుంటే మనుగడ అసాధ్యమన్నారు. సకాలంలో వర్షాలు పడేందుకు అవి దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రతి ఇంటి ఆవరణలో మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. వాటిని కంటిరెప్పలా కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీవో నగేశ్‌, నాయకులు తుకారాం, సోనేరావ్‌, రాందాస్‌, సురేశ్‌ పాల్గొన్నారు. 

జైనూర్‌: మానవ మనుగడకు మొక్కల పెంపకం దోహదపడుతుందని సీఐ జవ్వాజి సురేశ్‌ పేర్కొన్నారు. మండలంలోని మార్లవాయి గ్రామంలో ఆదివారం గ్రామస్తులతో మొక్కల పెంపకం, కరోనా వైరస్‌ వ్యాప్తి బారిన పడకుండా ఉండేందుకు చేపట్టాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చెట్ల వల్ల మానవాళికి కలిగే ఉపయోగాలను వివరించారు.కరోనా వైరస్‌ విజృంభిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ భౌతికదూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని సూచించారు. అనంతరం గ్రామస్తులకు మాస్కులు,  మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఐ తిరుపతి, సర్పంచ్‌ కనక ప్రతిభ, టీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్‌రావు, ఉపసర్పంచ్‌ సావిత్రి, గ్రామ పటేల్‌ మానిక్‌రావ్‌, వార్డు సభ్యులు గణపతి,  ఆనంద్‌రావ్‌, గోవింద్‌ పాల్గొన్నారు.

బెజ్జూర్‌: మండలంలోని మొగవెళ్లి, తుమ్మలగూడ గ్రామాల్లో పొలాలు, చేన్ల గట్లపై రైతులు, మండల కేంద్రంలో యువకులు మొక్కలు నాటారు. అలాగే పెద్దసిద్దాపూర్‌లో సర్పంచ్‌ రవి రైతులకు 150 టేకు మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్యదర్శులు రాజేశ్వర్‌, ఆనంద్‌, తదితరులు పాల్గొన్నారు. 

సిర్పూర్‌(టి): మండల కేంద్రంలోని మేజిస్ట్రేట్‌ బంగ్లా ఆవరణలో జూనియర్‌ సివిల్‌ కోర్టు న్యాయమూర్తి రామారావు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు పచ్చదనమే మార్గమన్నారు. ప్రజలంతా తమ ఇండ్లలో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు.logo