ఆదివారం 09 ఆగస్టు 2020
Komarambheem - Jul 05, 2020 , 23:18:21

బృందావనాన్ని తలపిస్తున్న సింగరేణి కార్యాలయాలు

బృందావనాన్ని తలపిస్తున్న సింగరేణి కార్యాలయాలు

బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి కార్మిక కాలనీలు, కార్యాలయాలు, గనులు, డిపార్ట్‌మెంట్లు, అధికారుల బంగ్లాలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. హరితహారంలో భాగంగా మొక్కలు నాటి సంరక్షించగా.. అవి ఏపుగా పెరిగి పచ్చదనంతో ఆహ్లాదం పంచుతున్నాయి. జీఎం కొండయ్య ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటి.. వాటిని కాపాడేందుకు ప్రత్యేకశ్రద్ధ చూపుతున్నారు.

కాగజ్‌నగర్‌ తహసీల్‌ కార్యాలయం..

కాగజ్‌నగర్‌ తహసీల్‌ కార్యాలయ ఆవరణలో నాటిన మొక్కలు పచ్చదనంతో కనువిందు చేస్తున్నాయి. కార్యాలయానికి వచ్చి వెళ్లేదారిలో పూలు, బాదం, అల్లనేరేడు పండ్ల మొక్కలతో పాటు ఔషధ మొక్కలు నాటగా, ఏపుగా పెరిగాయి. తహసీల్దార్‌ ప్రమోద్‌తో పాటు డిప్యూటీ తహసీల్దార్‌, ఆర్‌ఐ, వీఆర్వోలు, సిబ్బంది నిత్యం వాటిని సంరక్షిస్తున్నారు. వివిధ సమస్యల పరిష్కారం కోసం ఇక్కడికి వచ్చే ప్రజలు ఆ చెట్ల నీడన సేద తీరుతున్నారు. - రెబ్బెన/కాగజ్‌నగర్‌ రూరల్‌ logo