సోమవారం 06 జూలై 2020
Komarambheem - Jun 29, 2020 , 00:24:43

మహోన్నత వ్యక్తి పీవీ

మహోన్నత వ్యక్తి పీవీ

ఆసిఫాబాద్‌: కలెక్టరేట్‌ ఆవరణలో నిర్వహించిన జయంత్యుత్సవాల్లో జడ్పీ అధ్యక్షురాలు కోవలక్ష్మి ఎమ్మెల్యే ఆత్రం సక్కు, కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝాతో కలిసి పాల్గొన్నారు. పీవీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణకు చెందిన ఆయన దేశంలో తన ముద్ర వేసుకున్నారన్నారు. అదనపు కలెక్టర్‌ రాంబాబు, డీఆర్వో సురేశ్‌, అధి కారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

మంచిర్యాల అగ్రికల్చర్‌: రిమ్స్‌(ప్రేరణ) డిగ్రీ కళాశాల ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌ రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఉమ్మడి ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌ కుమార్‌ పాల్గొన్నారు. పీవీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. మాజీ జడ్పీటీసీ పెద్దపల్లి తిరుపతి, కరస్పాండెంట్‌ కృష్ణ కుమార్‌, ప్రిన్సిపాల్‌ దామోదర్‌ రెడ్డి, డైరెక్టర్లు ఎస్‌వీ రమణ, కళాధర్‌ రెడ్డి, రామ్మోహన్‌, మహేందర్‌ రెడ్డి పాల్గొన్నారు.


logo