సోమవారం 03 ఆగస్టు 2020
Komarambheem - Jun 29, 2020 , 00:22:24

పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత

పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత

జడ్పీ అధ్యక్షురాలు కోవ లక్ష్మి

ఆసిఫాబాద్‌: పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యతని జడ్పీ అధ్యక్షురాలు కోవ లక్ష్మి అన్నారు. పట్టణంలోని టీఆర్‌నగర్‌ హనుమాన్‌ ఆలయం వద్ద ఆదివారం మొక్కలు నాటారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ హరితహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆరు మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ చిలువేరు వెంకన్న, ఈవో రాజాబాబు, వంశీ తదితరులున్నారు.

శ్రీరాంపూర్‌: నస్పూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని కృష్ణకాలనీ 3వ వార్డులో కౌన్సిలర్‌ పంబాల గంగా ఎర్రయ్య ఆధ్వర్యంలో ఏ ర్పాటు చేసిన హరితహారంలో మంచిర్యా ల ఎమ్మెల్యే దివాకర్‌ రావు, చైర్మన్‌ ఈసంపెల్లి ప్రభాకర్‌, ఎస్‌ఐ మంగీలాల్‌తో కలిసి మొక్కలు నాటారు.  అష్టకాల రాధాకిషన్‌, టీబీజీకేఎస్‌ కేంద్ర చర్చల ప్రతినిధి ఏనుగు రవీందర్‌రెడ్డి, రీజియన్‌ కార్యదర్శి మంద మల్లారెడ్డి, టీఆర్‌ఏస్‌ మండలాధ్యక్షుడు వంగ తిరుపతి, కౌన్సిలర్లు లక్షి, చీడం మహేశ్‌, పూదరి కుమా ర్‌, అన్నపూర్ణ, బెడిక లక్షి, బండి పద్మ, హైమద్‌, మల్లెత్తుల రాజేంద్రపాణి, మాజీ ఉప సర్పంచ్‌ మోతె కనకయ్య, నాయకులు పత్తి వెంకటేశ్‌, జగన్‌, నరేశ్‌, రమేశ్‌, తోకల సురేశ్‌, భీమయ్య, గట్టయ్య, స్వ రూప, వెంకటమ్మ ఉన్నారు. 

మంచిర్యాల టౌన్‌: మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 6, 18, 19 వార్డుల్లో చైర్మన్‌ పెంట రాజయ్య, వార్డుల కౌన్సిలర్లతో కలి సి మొక్కలు నాటారు.  కౌన్సిలర్లు సుం కరి శ్వేత, అఫీజా తాజొద్దీన్‌,  వంగపల్లి అనిత, పాల్గొన్నారు. తొమ్మిదో వార్డు కౌన్సిలర్‌ బొలిశెట్టి సునీత కిషన్‌ ఆధ్వర్యంలో పాతమంచిర్యాలలోని శ్రీలక్ష్మినగర్‌లో రోడ్లకు ఇరువైపులా మొక్కలు నా టారు. ఎర్రం తిరుపతి, మల్లాగౌడ్‌, రాం చందర్‌రెడ్డి, గంగన్న, పున్నం, తదితరులు పాల్గొన్నారు. 


logo