మంగళవారం 11 ఆగస్టు 2020
Komarambheem - Jun 25, 2020 , 00:08:18

సదరంను వినియోగించుకోండి

సదరంను వినియోగించుకోండి

ఆసిఫాబాద్‌: సదరం శిబిరాలను అర్హులు వినియోగించుకోవాలని జిల్లా వైద్యాధికారి కుమ్రం బాలు సూచించారు. జిల్లా కేంద్రంలోని మహిళా సమాఖ్య భవనంలో బుధవారం శిబిరం నిర్వహించారు. ఆర్థోపెడిక్‌ వైధ్యుడు సాయి కృష్ణ పరీక్షలు నిర్వహించారు. 46 మంది దివ్యాంగులు పరీక్షలు చేయించుకోగా 10 మంది రెన్యువల్‌ కోసం వచ్చినట్లు ఆయన చెప్పారు. అనంతరం బాలు  మాట్లాడుతూ కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా ప్రత్యేక తేదీలు కేటాయించినట్లు పేర్కొన్నారు. దివ్యాంగులు తమకు  కేటాయించిన తేదీల్లోనే రావాలన్నారు. కంటి సంబంధిత పరీక్షలు ఆదివాసీ భవన్‌, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ  వైద్యశాలలో ఉంటుందని చెప్పారు. 26, 30 జూ లైలో 2, 7, 9, 14, 16, 21, 23, 28, 30, 31, అగస్ట్‌లో 4, 6, 13, 18, 20, 25, 27 తేదీలు, సెప్టెంబర్‌లో 3, 8, 10, 15, 17, 22, 24, 29 తేదీల్లో క్యాంపులు ఉంటాయని తెలిపా రు. ముందుగా స్లాట్‌ బుక్‌ చేసుకోవాల్సి ఉం టుందని ఆయన పేర్కొన్నారు. డీపీఎం రామకృష్ణ, వైద్యుడు సత్యనారాయణ, దివ్యాంగులు, తదితరులు ఉన్నారు.


logo