మంగళవారం 11 ఆగస్టు 2020
Komarambheem - Jun 15, 2020 , 00:27:58

మారుమూల గ్రామాలకూ బీటీ రోడ్లు

మారుమూల గ్రామాలకూ బీటీ రోడ్లు

నెన్నెల: సమైక్య రాష్ట్రంలో కనీసం రహదారి సౌకర్యానికి నోచుకోని గ్రామాల్లో నేడు స్వరాష్ట్రంలో మారుమూల పలెల్లకు సైతం బీటీ రోడ్లు వేస్తుండడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌  ప్రభుత్వం ఏర్పడడంతో మారుమూల గ్రామాల ప్రగతి మారుతుంది. నెన్నెల మండలం కొత్తూర్‌,చిన్న వెంకటాపూర్‌ గ్రామాలు కనీస సదుపాయాలు లేక తల్లడిల్లాయి.అక్కడికి వెళ్లాలంటే నానా అవస్థలు పడేవారు. వర్షాకాలంలో ఈ బాధలు వర్ణణాతీతం. గ్రామాలను ఆనుకొని అడవి, చుట్టూ వాగులు ఎటు వెళ్లాలన్నా సరైన రోడ్లు లేని దుస్థితి. ఉన్న రోడ్డు గుంతలుగా మారి నరక యాతన అనుభవించారు. కాని ఇప్పుడు అదే గ్రామాలకు బీటీ రోడ్డు పనులు శరవేగంగా సాగుతున్నా యి. భీమారం ఆవుడం ఆర్‌ అండ్‌ బీ రోడ్డు నుంచి చిన్న వెంకటాపూర్‌, పొట్యాల, కొత్తూర్‌ గ్రామాలకు రూ. రూ.4.64 కోట్లతో చేపట్టిన రోడ్డు పనులు, కల్వర్టుల నిర్మాణాలు కొనసాగుతున్నాయి.  

హామీ నెరవేర్చిన ఎమ్మెల్యే చిన్నయ్య

శాసన సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా చిన్న వెంకటాపూర్‌, కొత్తూర్‌ గ్రామాలకు వెళ్లిన చిన్నయ్యకు అక్కడి ప్రజలు తమ బాధలు వెల్లడించారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత  వెంట నే ఈగ్రామాలకు రోడ్డు పనులు ప్రారంభించడానికే వస్తానని, అప్పటి వరకు రానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రెండు నెలల వ్యవధిలోనే రోడ్డు నిర్మాణం చేపట్టడానికి అధికారులతో నివేదిక తయారు చేయించి, రూ. 4.64 కోట్లు మంజూరు చేయించారు. 2019 డిసెంబర్‌లో రోడ్డు పనులు ప్రారంభించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో రోడ్డు పనుల్లో కొంత ఆలస్యమైనా, తిరిగి పనులు శరవేగంగా సాగుతున్నాయి.దీంతో ఆయా గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.సర్పంచ్‌లు మేకల శారద, మల్లేశ్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ మేకల మల్లేశ్‌ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. 


logo