గురువారం 13 ఆగస్టు 2020
Komarambheem - Jun 15, 2020 , 00:26:59

బాధిత కుటుంబానికి పరామర్శ

బాధిత కుటుంబానికి పరామర్శ

రెబ్బెన: మండలంలోని మదవాయిగూడ గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ యువ నాయకుడు దోబే శ్రీనివాస్‌ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆదివారం జడ్పీ అధ్యక్షురాలు కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు శ్రీనివాస్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉండి అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వారి వెంట టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పొటు శ్రీధర్‌రెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శి కుందారపు శంకరమ్మ, జడ్పీటీసీ వేముర్ల సంతో ష్‌, ఎంపీపీ జుమ్మిడి సౌందర్య, వైస్‌ఎంపీపీ గజ్జల సత్యనారాయణ, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు చెన్న సోమశేఖర్‌, సర్పంచ్‌ శ్యాంరావు ఉన్నారు.logo