శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Komarambheem - Jun 15, 2020 , 00:18:33

అన్ని వర్గాల అభివృద్ధే సీఎం కేసీఆర్‌ ధ్యేయం

అన్ని వర్గాల అభివృద్ధే  సీఎం కేసీఆర్‌ ధ్యేయం

కాగజ్‌నగర్‌టౌన్‌ : అన్నివర్గాల ప్రజల అభివృద్ధే సీఎం కేసీఆర్‌ ధ్యేయమని సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ కోనేరు కృష్ణారావు, మున్సిపల్‌ చైర్మన్‌ సద్దాం హుస్సేన్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ గిరీశ్‌కుమార్‌తో కలిసి ఆదివారం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. దేశంలో ఎక్కడాలేని విధంగా అన్ని వర్గాల అభివృద్ధే ధ్యేయంగా పథకాలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెడుతున్నారన్నారు. పేదింట పిల్లల పెండ్లీల కోసం కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను ప్రవేశపెట్టి రూ.లక్షా 116 అందిస్తున్నారని అన్నా రు.  ఇందులో  భాగంగా 92 మంది లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను అందజేసినట్లు తెలిపారు. రెసిడెన్షియల్‌ పాఠశాలలు ఏర్పాటు చేసి ఉన్నత విద్యను అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు.  కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ గిరీశ్‌ కుమార్‌, కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. logo