మంగళవారం 04 ఆగస్టు 2020
Komarambheem - Jun 11, 2020 , 04:44:01

ప్రజల్లో భయాందోళనలు తొలగించాలి

ప్రజల్లో భయాందోళనలు తొలగించాలి

  • వీడియో కాన్ఫరెన్స్‌లోవైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల 

ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ వ్యాప్తిపై ప్రజల్లో భయాందోళనలు తొలగించాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ జిల్లా వైద్యాధికారులకు సూచించారు. బుధవారం హైదరాబాద్‌ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి మాట్లాడారు. ప్రజలు అనవసర భయం వీడి, వైద్యంపై భరోసా కల్పించాలన్నారు. వైద్యసేవలకు అంతరాయం  కలుగకుండా చూడాలని, కొవిడ్‌-19 కొత్త గైడ్‌లైన్స్‌ ప్రకారం కరోనా అనుమానితులను ఇంటి వద్దే ఉంచి చికిత్స చే యాల్సి ఉంటుందన్నారు.  వైరస్‌ లక్షణాలు ఉన్న వారిని దవాఖానలో చికిత్స అందించాలని సూ చించారు. వైద్య సేవలపై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి కుమ్రం బాలు, వైద్యశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. logo