సోమవారం 06 జూలై 2020
Komarambheem - Jun 03, 2020 , 04:39:40

పారిశుధ్య పనులు చేపట్టాలి

పారిశుధ్య పనులు చేపట్టాలి

వాంకిడి: వానకాలం సీజనల్‌ వ్యాధుల నేపథ్యంలో గ్రామాల్లో ముమ్మరంగా పారిశుధ్య పనులు చేపట్టాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా గ్రామ పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. మంగళవారం మండలంలోని జైత్‌పూర్‌, తేజిగూడ గ్రామాల్లో పల్లెప్రగతి అభివృద్ధి పనులను పరిశీలించారు. తేజిగూడలో డ్రైనేజీలను శుభ్రం చేయించడంతో పాటు ప్రధాన రోడ్డుకు ఇరువైపులా పిచ్చిమొక్కలను తొలగించి, హరితహారం మొక్కలు నాటించాలని ఎంపీడీవో వెంకటేశ్వర్‌రెడ్డిని ఆదేశించారు. అలాగే జైత్‌పూర్‌లో కొనసాగుతున్న శ్మశానవాటిక, డంపింగ్‌యార్డు నిర్మాణ పనులు, నర్సరీలను పరిశీలించారు. కార్యక్రమంలో డీపీవో రమేశ్‌, ఎంపీడీవో వెంకటేశ్వర్‌రెడ్డి, సర్పంచ్‌లు సుగంధబాయి, రేణుక పాల్గొన్నారు.


logo