బుధవారం 08 జూలై 2020
Komarambheem - Jun 03, 2020 , 04:35:05

నిరాడంబరంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

నిరాడంబరంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్‌లలో  ప్రభుత్వ విప్‌లు బాల్క సుమన్‌, అరికెపూడి గాంధీ జెండా వందనం 

 మంచిర్యాల/ కుమ్రం భీం ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ: మంగళవారం మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లో నిరాడంబరంగా నిర్వహించారు. మంచిర్యాల కలెక్టరేట్‌లో జెండా ఎగురవేశారు. అంతకుముందు తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాలవేశారు. అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, జడ్పీ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మి, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రేణికుంట్ల ప్రవీణ్‌, కలెక్టర్‌ భారతీ హోళికేరీ, అదనపు కలెక్టర్‌ సురేందర్‌రావు, ట్రైనీ కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పాల్గొన్నారు. బెల్లంపల్లిలో ఎమ్మెల్యే గుండా చిన్నయ్య జెండా ఎగురవేశారు. శ్రీరాంపూర్‌, మందమర్రి, గోలేటి జీఎం కార్యాలయాల్లో జీఎంలు పతాకావిష్కరణ చేశారు. కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌లో ప్రభుత్వ విప్‌ అరికెపూడి గాంధీ జెండా ఎగురవేశారు. జడ్పీ అధ్యక్షురాలు కోవ లక్ష్మి, సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా పాల్గొన్నారు.  సిర్పూర్‌ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కోనప్ప, జడ్పీ కార్యాలయంలో చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నతాధికారులు పతాకావిష్కరణ చేశారు.


logo