శుక్రవారం 14 ఆగస్టు 2020
Komarambheem - May 29, 2020 , 02:24:26

గిరిజన రైతులను ఇబ్బంది పెట్టవద్దు

గిరిజన రైతులను ఇబ్బంది పెట్టవద్దు

 అటవీ శాఖ అధికారులకు తగిన ఆదేశాలివ్వండి

 పీవో భావేశ్‌ మిశ్రాకు కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జడ్పీ అధ్యక్షురాలు కోవ లక్ష్మి వినతి

ఉట్నూర్‌: కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో గిరిజన రైతులను ఇబ్బం ది పెట్టకుండా అటవీ శాఖ అధికారులకు ఆదేశాలివ్వాలని జడ్పీ అధ్య క్షురాలు కోవలక్ష్మి ఐటీడీఏ పీవో భావేశ్‌ మిశ్రాను కోరారు. ఈ మేరకు గురువారం జిల్లా నాయకులు, జడ్పీ వైస్‌ చైర్మన్‌ కోనేరు కృష్ణ, గ్రంథా లయ చైర్మన్‌ కనక యాదవ్‌రావుతో కలిసి పీవో క్యాంపు కార్యాలయం లో వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అడ వులపై ఆధారపడి జీవించే గిరిజనులను అటవీ అధికారులు అడుగడు గునా ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. పోడు భూములలో వ్యవ సాయం చేయనివ్వడం లేదని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించాలని కోరారు. అనంతరం పలు సమస్యలను ఆ యనకు విన్నవించారు. ఆమె వెంట స్థానిక నాయకులు ఉన్నారు.


logo