గురువారం 13 ఆగస్టు 2020
Komarambheem - May 29, 2020 , 02:24:25

లాభసాటిగా మార్చిన ఘనత కేసీఆర్‌దే

లాభసాటిగా  మార్చిన ఘనత కేసీఆర్‌దే

 ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌ రెడ్డి

 చాత గ్రామంలో నియంత్రిత సాగుపై రైతులకు అవగాహన సదస్సు

కుభీర్‌: వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చిన ఘనత  సీ ఎం కేసీఆర్‌కే దక్కుతుందని ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి అన్నారు. కుభీర్‌ మండలంలోని చాత గ్రామంలో నియం త్రిత సాగుపై గురువారం అవగాహన సదస్సు నిర్వహించా రు. సీఎం కేసీఆర్‌ తెచ్చిన విప్లవాత్మక మార్పుల వల్లే రైతు లు ఆర్థికంగా మంచిస్థాయిలో నిలుస్తున్నారని పేర్కొన్నా రు. పంట మార్పిడి విధానాన్ని అవలంబించి, మంచి దిగు బడి పొందాలని రైతులకు సూచించారు. ఈ వాన కాలంలో మక్కకు బదులు సోయా, కంది, పత్తి పంటలు సాగు చేసుకోవడం మేలన్నారు.  అనంతరం వ్యవసాయ శాఖ అధికారులు నియంత్రిత సాగు విధానంపై అవగాహన కల్పించారు.  రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు పుప్పా ల పీరాజీ, వైస్‌ ఎంపీపీ మొహియోద్దీన్‌, సింగిల్‌ విండో చై ర్మన్‌ రేకుల గంగాచరణ్‌, ఏవో వికార్‌ అహ్మద్‌, ఎంపీడీవో శేఖర్‌, టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యదర్శి తూం రాజేశ్వర్‌, టీఆర్‌ఎ స్‌ మండలాధ్యక్షుడు అనిల్‌, మాజీ జడ్పీటీసీ శంకర్‌ చౌహా న్‌, అనిల్‌ పటేల్‌, రైతులు పాల్గొన్నారు.  


logo