సోమవారం 10 ఆగస్టు 2020
Komarambheem - May 28, 2020 , 03:58:19

సన్నరకాలతోనే లాభాలు

సన్నరకాలతోనే లాభాలు

  • తెలంగాణ సోనా రకానికి ప్రాధాన్యమివ్వాలి
  • 120 రోజుల్లోనే పంట చేతికొస్తుంది
  • నియంత్రిత సాగు సదస్సుల్లో కలెక్టర్‌ భారతీ హోళికేరి
  • కొత్తూర్‌లో రైతుల సామూహిక ప్రతిజ్ఞ

లక్షెట్టిపేట : రైతులు తెలంగాణ సోనా సన్న రకాన్ని సాగు చేసి అధిక లాభాలు పొందాలని మంచిర్యాల కలెక్టర్‌ భారతీ హోళికేరి పిలుపునిచ్చారు. బుధవారం మండలంలోని కొత్తూర్‌, ఊత్కూర్‌, అంకతిపల్లి, రంగపేట్‌ గ్రామాల్లో ‘నియంత్రిత సాగు’పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వరిలో ముఖ్యంగా సన్న రకాలు సాగు చేయాలన్నారు. తెలంగాణ సోనా పంట 120 రోజుల్లో చేతికి వస్తుందని వివరించారు. ఇందులో ైగ్లెసీమిక్‌ ఇండెక్స్‌ 51 శాతం ఉండడంతో షుగర్‌ బాధితులకు ఎంతో మంచిదన్నారు. మిగతా వరి రకాలు 75 వరకు కలిగి ఉంటాయని, అంతగా డిమాండ్‌ కూడా ఉండదని పేర్కొన్నారు. అలాగే పత్తిలో అంతర పంటగా కంది వేయాలని రైతులకు సూచించారు. అంతర పంటల వల్ల నేల సారవంతమవుతుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో దొడ్డు రకం వరి సాగు చేయవద్దని, తర్వాత ఇబ్బందులు పడవద్దని సూచించారు. అనంతరం 910 ఎకరాల్లో వరి, 295 ఎకరాల్లో పత్తి, 14 ఎకరాల్లో కంది సాగు చేస్తామని కొత్తూర్‌ రైతులతో సామూహిక ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి వినోద్‌, రైతు బంధు సమితి మంచిర్యాల కో ఆర్డినేటర్‌ గురువయ్య, ఎంపీపీ అన్నం మంగ, ఎంపీటీసీ తార, వ్యవసాయాధికారి ప్రభాకర్‌, తదితరులు పాల్గొన్నారు.  logo