మంగళవారం 11 ఆగస్టు 2020
Komarambheem - May 26, 2020 , 23:57:35

ఈదురుగాలుల బీభత్సం

ఈదురుగాలుల బీభత్సం

ఆసిఫాబాద్‌/కెరమెరి:  జిల్లా కేంద్రంలోని మంగళవారం సాయంత్రం ఈదురుగాలుల బీభత్సం సృష్టించింది. ఉదయం నుంచి మధ్యా హ్నం నాలుగు గంటల వరకు ఎండ తీవ్రత 45 డిగ్రీల వరకు ఉండగా, ఒక్కసారి ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. సుమారు ఆరగంట పాటు ఈదురుగాలులతో వర్షం కురిసింది. స్థానిక జిల్లా పరిషత్‌ బాలుర పాఠశాల సమీపంలోని టేల, జూబ్లీమార్కెట్‌ వద్దనున్న టేలాల రేకులు లేచిపోయాయి. కెరమెరి మండలం ఝరి, జ్యోతినగర్‌తో పాటు మరికొన్ని గ్రామాలో కొద్దిపాటి వడగళ్లవాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులకు ఝరి గ్రామంలో చెట్టు కొమ్మలు విరిగి పడడంతో విద్యుత్‌ తీగలు ఇంటిపై పడ్డాయి. ఇంటిపైకప్పు రేకులు ఎగిరిపోయాయి. రెండు గంటల పాటు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. 


logo