ఆదివారం 09 ఆగస్టు 2020
Komarambheem - May 24, 2020 , 23:48:43

నియంత్రిత సాగే మేలు

నియంత్రిత సాగే మేలు

 రైతులను లాభాల బాట   పట్టించడమే సీఎం కేసీఆర్‌ ధ్యేయం

 పంటల మార్పిడితోనే అధిక దిగుబడి

 సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

  కౌటాల, చింతలమానేపల్లిలో అవగాహన సదస్సులు

కౌటాల/చింతలమానేపల్లి : ప్రతి రైతు సీఎం కేసీఆర్‌ సూచించిన విధంగా నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేస్తూ రైతులు ఆర్థిక లాభాలు పొందాలని సిర్పూ ర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పేర్కొన్నారు. కౌటల, చింతలమానేపల్లి మండల పరిషత్‌ కార్యాలయాల్లో నియంత్రిత వ్యవసాయ పద్ధతులపై నిర్వహించిన అవగాహన సదస్సులకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయరంగం మరింత అభివృద్ధి చెందిందన్నారు. ఈ ప్రాంతంలో పత్తి, వరి, కంది పంటతోపాటు కందిలో అంతర పంటలను వేయాలని, రైతులు మిరప పంట వేసేలా వ్యవసాయాధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. సకాలంలో ఎరువులు విత్తనాలు అందిస్తామని, రైతులు అధైర్యపడొద్దని తెలిపారు.  దద్దమ్మలు మాయమాటలు చెప్పి రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. చింతలమానే పల్లి మండలం డబ్బా, రవీంద్రనగర్‌, బాలాజీ అన్‌కోడ, బాబాపూర్‌ గ్రామాల ఏఈ ఓ రాజేశ్వర్‌ విధులకు హాజరుకావడం లేదని గ్రామస్తులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. ఏఈఓపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతువేదిక భవనాలు నాలుగు మంజూరయ్యాయని, ఒక్కో భవవానికి రూ. 13లక్షల చొప్పున మంజూరు చేసి నిర్మాణం మొదలు పెడతామని తెలిపారు. రైతులు అక్కేడ ఏయే పంటలు సాగు చేయాలో వ్యవసాయాధి కారులతో కలిసి చర్చించుకోవచ్చని పేర్కొన్నారు. ఆయా చోట్ల ఎంపీపీలు విశ్వనాథ్‌, ఎంపీపీ డు బ్బుల నానయ్య, డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌ మాం తయ్య, జడ్పీటీసీ అనూష, తహసీల్దార్‌ రాజేశ్వరి, రైతు బంధు సమితి మండల అధ్యక్షులు బ్రహ్మ య్య, భీంకరి నారాయణ, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌, మండల కోఆప్షన్‌ నజీం హుస్సేన్‌, ఎంపీడీఓ రాజేశ్వర్‌, ఏఓ రాజే శ్వర్‌, వైస్‌ ఎంపీపీ డుబ్బుల వెంకయ్య, ఎంఏఓ రాజేశ్‌, టొంబ్రె మారుతి, డుబ్బుల మహేశ్‌ పాల్గొన్నారు. కాగా కర్జెల్లి గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ కార్యకర్త జునుగరి నారాయణ తండ్రి మృతి చెందడంతో వారి కుటుంబాన్ని ఎమ్మెల్యే పరా మర్శించారు. 


logo