మంగళవారం 11 ఆగస్టు 2020
Komarambheem - May 21, 2020 , 23:34:22

ఎరువులొచ్చినయ్‌..

ఎరువులొచ్చినయ్‌..

ఆదిలాబాద్‌ జిల్లాకు చేరిన ర్యాక్‌లు

రెండు రోజులుగా 5,200 మెట్రిక్‌ టన్నులు రాక

87,600 మెట్రిక్‌ టన్నులు అవసరమని అంచనా

నెలల వారీగా రైతులకు పంపిణీ

ఆదిలాబాద్‌, నమస్తే తెలంగాణ: జిల్లాలో రైతులు పత్తి, కంది, సోయాబీన్‌, జొన్న పంటను ఎక్కువగా సాగుచేస్తారు. వ్యవసాయ అధికారులు తయారు చేసిన పంటల సాగు ప్రణాళిక ఆధారంగా  వానకాలం, యాసంగి పంటలు ఎంతవరకు ఎరువులు అవసరమవుతాయో గుర్తించి కొరత లేకుండా చర్యలు తీసుకుంటారు. ఈ ఏడాది వానకాలంలో 87,600 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరమవుతాయని అధికారులు గుర్తించారు. వీటిలో యూరియా 38 వేల మెట్రిక్‌ టన్నులు, డీఏపీ 15,500 మెట్రిక్‌ టన్నులు, ఎంవోపీ 6వేల మెట్రిక్‌ టన్నులు, కాంప్లెక్స్‌ ఎరువులు 23వేల మెట్రిక్‌ టన్నులు, ఎస్‌ఎస్‌పీ 5,100 మెట్రిక్‌ టన్నులు అవసరమవుతాయని అంచనాలు తయారు చేశారు. ఏప్రిల్‌ లో 2,500 మెట్రిక్‌ టన్నుల యూరియా, 1000 మెట్రిక్‌ టన్నుల డీఏపీ, 500 మెట్రిక్‌ టన్నుల ఎంవోపీ, ఒక మెట్రిక్‌ టన్ను కాంప్లెక్స్‌ ఎరువులు, 500 టన్నుల ఎస్‌ఎస్‌పీ, మేలో 3,500 టన్నుల యూరియా, 4 వేల మెట్రిక్‌ టన్నులు డీఏపీ, 500 టన్నుల ఎంవోపీ, 4 వేల టన్నుల కాంప్లెక్స్‌, 600 టన్నుల ఎస్‌ఎస్‌పీ, జూన్‌లో 5,500 టన్నుల యూరియా, 6వేల టన్నుల డీఏపీ, 1000 టన్నుల ఎంవోపీ, 6వేల టన్నుల కాంప్లెక్స్‌, 2వేల టన్నుల ఎస్‌ఎస్‌పీ, జూలైలో 7 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా, 3 వేల మెట్రిక్‌ టన్నుల డీఏపీ, 1000 టన్నుల ఎంవోపీ, 5వేల టన్నుల కాంప్లెక్స్‌, 1000 టన్నుల ఎస్‌ఎస్‌పీ, ఆగస్టులో 13,500 టన్నుల యూరియా, 1000 టన్నుల డీఏపీ, 1,500  టన్నుల ఎంవోపీ, 3 వేల టన్నుల కాంప్లెక్స్‌, 500 టన్నుల ఎస్‌ఎస్‌పీ, సెప్టెంబరులో 6 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా, 500 టన్నుల డీఏపీ, 1,500 ఎంవోపీ, 3 వేల మెట్రిక్‌ టన్నుల కాంప్లెక్స్‌, 500 మెట్రిక్‌ టన్నుల ఎస్‌ఎస్‌పీ ఎరువులను పంపిణీ చేయనున్నారు. ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకు రైతులకు అవసరమైన వాటిని సరఫరా చేస్తారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలతో పాటు ఎరువుల డీలర్ల వద్ద అందుబాటులో ఉంచుతారు. రెండ్రోజులుగా 5,200 మెట్రిక్‌ టన్నుల ఎరువులు వచ్చినట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. విక్రయాల్లో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా ఆన్‌లైన్‌ విధానంలో రైతులకు ఎరువులు అందించనున్నారు.


logo