శనివారం 06 జూన్ 2020
Komarambheem - May 20, 2020 , 23:45:23

సర్వే పూర్తయ్యే దాకా సాగు వద్దు

సర్వే పూర్తయ్యే దాకా సాగు వద్దు

  • జూన్‌ 3 నుంచి కొండపల్లి శివారులో అటవీ, రెవెన్యూ శాఖల సంయుక్త సర్వే
  • ఎఫ్‌డీవో విజయ్‌కుమార్‌
  • ఎఫ్‌డీవో విజయ్‌ కుమార్‌ 

బెజ్జూర్‌ (పెంచికల్‌పేట) : అటవీ, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించే సర్వే పూర్తయ్యే దాకా సమస్యాత్మకంగా ఉన్న భూములను సాగు చేయవద్దని కాగజ్‌నగర్‌ ఎఫ్‌డీవో విజయ్‌ కుమార్‌ రైతులకు సూచించారు. పెంచికల్‌పేట మండలంలోని లోడ్‌పల్లి శివారులో బుధవారం రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ.. అటవీ, రెవెన్యూ శాఖల మధ్య సమస్యాత్మకంగా ఉన్న భూములు, ఏ శాఖ పరిధిలో ఉన్నాయో తెలుసుకునేందుకు జూన్‌ 3 నుంచి సంయుక్త సర్వే ప్రారంభించనున్నట్లు చెప్పారు. అప్పటి దాకా రైతులు సాగు చేయవద్దని, నిబంధనలను అతిక్రమిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో 110 ఎకరాల్లో సర్వే చేయగా, 256 ఎకరాల్లో పూర్తికావాల్సి ఉందన్నారు. ఇందుకు అధికారులు సర్వే చేసి, హద్దులు ఏర్పాటు చేసిన అనంతరం భూములు రెవెన్యూ పరిధిలో ఉంటే రైతులు సాగు చేసుకోవచ్చని తెలిపారు. అటవీ శాఖ పరిధిలో ఉన్న భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ సాగుకు అనుమతించబోమని స్పష్టం చేశారు. తొందరపడకుండా అధికారుల సూచనలు పాటించి, అటవీ, రెవెన్యూ శాఖలకు సహకరించాలని కోరారు. సమావేశంలో కాగజ్‌నగర్‌ డీఎస్పీ బీఎల్‌ఎన్‌ స్వామి, కాగజ్‌నగర్‌ రూరల్‌ సీఐ నరేందర్‌, రేంజ్‌ అధికారి వేణుగోపాల్‌, ఎమ్మారై సంతోష్‌, ఎస్‌ఐ రమేశ్‌, సర్పంచ్‌ జాజిమొగ్గ శ్రీనివాస్‌, రైతులు పాల్గొన్నారు. 


logo