శనివారం 08 ఆగస్టు 2020
Komarambheem - May 14, 2020 , 02:15:58

సరుకులు పంచుతూ.. ఆకలి తీరుస్తూ..

సరుకులు పంచుతూ.. ఆకలి తీరుస్తూ..

  • నిత్యావసరాలు, బియ్యం, కూరగాయల పంపిణీ   
  • యాచకులు, వలస కూలీలకు అన్నదానం 

చెన్నూర్‌ : ప్రభుత్వ విప్‌ సుమన్‌ ఆధ్వర్యంలోని బాల్క ఫౌండేషన్‌ ద్వారా పట్టణంలోని పేదలు, వలస కూలీలకు అన్నదానం చేస్తున్నారు. 45 రోజులుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. బుధవారం ట్రాలీ ఆటో ద్వారా పేదలు, వలస కార్మికుల వద్దకు వెళ్లి భోజనం అందించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు రాంలాల్‌ గిల్డా, నాయిని సతీశ్‌, మేడ సురేశ్‌రెడ్డి పాల్గొన్నారు.

తాండూర్‌ : తాండూర్‌లో 205 మంది పాదచారులు, వలస కూలీలకు భోజనాన్ని దాతల సహకారంతో అభినవ సంస్థ అధ్యక్షుడు సంతోష్‌కుమార్‌ అందించారు. రేచిని రోడ్‌ రైల్వేకాలనీ, వేణునగర్‌లో 16 నిరుపేద కుటుంబాలకు నిత్యావసరాలను దాత షేక్‌ ముక్తార్‌ పంపిణీ చేశారు. దాతలు శ్రీకాంత్‌, రమేశ్‌ మిత్ర బృందం అందించిన పౌష్టికాహారం, పండ్లను రేచిని రోడ్‌రైల్వే కాలనీ, వేణునగర్‌లో 20 మంది గర్భిణులు, బాలింతలకు జడ్పీటీసీ సాలిగామ బానయ్య పంపిణీ చేశారు.

శ్రీరాంపూర్‌ : నస్పూర్‌ 6వ వార్డు కౌన్సిలర్‌ పూదరి కుమార్‌ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ, సింగరేణి పారిశుధ్య కార్మికులకు అన్నదాన కార్యక్రమాన్ని బుధవారం మున్సిపల్‌ చైర్మన్‌ ఇసంపెల్లి ప్రభాకర్‌, నడిపెల్లి చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ విజిత్‌రావు ప్రారంభించారు. కార్యక్రమంలో సీఐ కోటేశ్వర్‌, ఎస్‌ఐ మంగీలాల్‌, నస్పూర్‌ వైస్‌ చైర్మన్‌ తోట శ్రీనివాస్‌, టీబీజీకేఎస్‌ ఉపాధ్యక్షుడు కే.సురేందర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ మల్లెత్తుల రాజేంద్రపాణి, నాయకులు శ్రీరాములు, పాముల లక్ష్మి, హరీశ్‌, గుండా తిరుపతి, దేవేందర్‌, గోపతి తిరుపతి, కుమార్‌, కృష్ణ, అశోక్‌, రమేశ్‌ పాల్గొన్నారు.

మంచిర్యాల అగ్రికల్చర్‌ : వలస కూలీలకు, తపాలా శాఖలో పనిచేసే క్యాజువల్‌ లేబర్స్‌కి ఆ శాఖ ఉద్యోగులు 25 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు. కార్యక్రమంలో సబ్‌ రికార్డ్‌ ఆఫీసర్‌ బెల్లపు దేవేందర్‌, పోస్ట్‌మాస్టర్‌ వివేక్‌, ఐపీపీబీ మేనేజర్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

జైనూర్‌/లింగాపూర్‌ : సిర్పూర్‌(యు) మండల కేంద్రంలో సిర్పూర్‌(యు), లింగాపూర్‌ మండలాల్లోని 400 నిరుపేద కుటుంబాలకు కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జడ్పీ అధ్యక్షురాలు కోవ లక్ష్మి, ఎమ్మె ల్యే ఆత్రం సక్కు సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సిర్పూర్‌(యు) ఎంపీపీ తొడసం భాగ్యలక్ష్మి, వైస్‌ ఎంపీపీ ఆత్రం ప్రకాశ్‌, సర్పంచ్‌ వీణాబాయి, సహకార సంఘం చైర్మన్‌ శివాజీ, మాజీ ఎంపీపీ ఆత్రం భగవంత్‌రావ్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు తొడసం ధర్మారావ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. అలాగే ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఆదేశాల మేరకు లింగాపూర్‌లోని కంచన్‌పల్లి, మామిడిపల్లి, కొత్తపల్లి, లింగాపూర్‌, ఎల్లాపటార్‌, గోపాల్‌పూర్‌ గ్రామాల్లోని నిరుపేద కుటుంబాలకు ఎంపీపీ సవిత, వైస్‌ ఎంపీపీ ఆత్మారాం, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు ఆత్రం అనిల్‌ సరుకులు పంపిణీ చేశారు. 

కౌటాల : వివిధ ప్రాంతాల నుంచి మహారాష్ట్రకు కాలినడకన వెళ్తున్న వలస కూలీలకు మండల కేంద్రంలో ని జై భవానీ ఆటోమొబైల్‌ యజమాని రోహినే సం తోష్‌ అతడి తండ్రి గంగారాం జ్ఞాపకార్థం పులిహోర, అంబలి పంపిణీ చేశారు. అలాగే మండల కేంద్రంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు వద్ద ఖాతాదారులకు ఎల్క రాజన్న కుటుంబ సభ్యులు అన్నదానం చేశారు.

బెజ్జూర్‌(పెంచికల్‌పేట) : మండలంలోని జైహింద్‌పూర్‌లో 78 నిరుపేద కుటుంబాలకు  ఆర్‌ఎస్‌ఎస్‌, బజరంగ్‌దళ్‌ సభ్యులు నిత్యావసర సరుకులు అందజేశారు. బియ్యం, పప్పులు, కూరగాయలు, నూనె ప్యాకెట్లు ఇచ్చారు. ఆర్‌ఎస్‌ఎస్‌ కరీంనగర్‌ జిల్లా సేవా ప్రముఖ్‌ రంగస్వామి, బజరంగ్‌దళ్‌ జిల్లా సంయోజక్‌ శివాగౌడ్‌, సభ్యులు శుభం లోయా, నరేశ్‌, మంగీలాల్‌, శోభన్‌, ప్రభు ఉన్నారు.

రెబ్బెన : గోలేటి టౌన్‌షిప్‌లోని పారిశుధ్య కార్మికులకు ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. రెబ్బెనలో బ్యాంకులకు వచ్చే ఖాతాదారులకు ఇందిరానగర్‌ శ్రీ కనకదుర్గాదేవి ఆలయ అర్చకుడు దేవర వినోద్‌ అంబలి పంపిణీ చేశారు. జడ్పీటీసీ వేముర్ల సంతోష్‌, సర్పంచ్‌ పోటు సుమలత, డాక్టర్‌ భరత్‌, ఎస్‌ఐ దీకొండ రమేశ్‌, ఎమ్మార్పీఎస్‌ నాయకులు కేశవరావు మాదిగ, లింగంపల్లి ప్రభాకర్‌ మాదిగ, గోపాలకృష్ణ, జనక్‌ప్రసాద్‌ పాల్గొన్నారు. 

తిర్యాణి : బుగ్గరామన్న గ్రామంలోని 20 కొలాం గిరిజన కుటుంబాలకు రెబ్బెన మండలం గోలేటి సింగరేణి పాఠశాల పూర్వ విద్యార్థులు సమకూర్చిన నిత్యావసరాలను సర్పంచ్‌ వల్క రాధ పంపిణీ చేశారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు కడతల సాయి, శ్రీకాంత్‌, చీమల మహేశ్‌, పిట్టల రవి, నారాయణ పాల్గొన్నారు.logo