శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Komarambheem - May 14, 2020 , 01:25:42

రైతు సంక్షేమమే ధ్యేయం

రైతు సంక్షేమమే ధ్యేయం

  • ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి

కాల్వశ్రీరాంపూర్‌/ఓదెల/సుల్తానాబాద్‌ రూరల్‌/జూలపల్లి : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. రైతుబంధు నిధుల విడుదల, రుణమాఫీపై హర్షం వ్యక్తం చేస్తూ కాల్వశ్రీరాంపూర్‌, జూలపల్లి మండలం కాచాపూర్‌, ఎలిగేడు, ఓదెల మండలం కొలనూర్‌, సుల్తానాబాద్‌ మండలం బొంతకుంటపల్లి, ఐతరాజ్‌పల్లిలో సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు టీఆర్‌ఎస్‌ నాయకులు పాలాభిషేకం చేశారు. కాల్వశ్రీరాంపూర్‌లో కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. 40కిలోలకు బదులుగా 41కిలోలు తూకం వేయడాన్ని చూసి నిర్వాహకులపై ఆగ్రహించారు. సంబంధిత మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయా చోట్ల జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్‌ రఘువీర్‌సింగ్‌, జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ మండిగ రేణుక, ఎంపీపీలు నూనేటి సంపత్‌, బాలాజీరావు, కూసుకుంట్ల రమాదేవి, జడ్పీటీసీలు వంగళ తిరుపతిరెడ్డి, బొద్దుల లక్ష్మణ్‌, నాయకులు బండారి ఐలయ్య, కొట్టె రవీందర్‌, ఐరెడ్డి వెంకటరెడ్డి, బైరెడ్డి రాంరెడ్డి పాల్గొన్నారు. logo