గురువారం 13 ఆగస్టు 2020
Komarambheem - May 12, 2020 , 01:41:14

మాస్కులు ధరించనందుకు మూల్యం..

మాస్కులు ధరించనందుకు మూల్యం..

  • నిబంధనలు పాటించని వ్యాపారులకు సైతం..
  • మంచిర్యాలలో భారీగా జరిమానాలు

రామకృష్ణాపూర్‌/మంచిర్యాల టౌన్‌/దండేపల్లి/ఆసిఫాబాద్‌ టౌన్‌/కౌటాల : మాస్కులు ధరించకపోవడంతో పాటు నిబంధనలు పాటించని వ్యాపారులకు జరిమానా వేశారు అధికారులు. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌లోని రాజీవ్‌చౌక్‌లో మాస్కులు పెట్టుకోనందుకు ఏడుగురికి జరిమానా విధించినట్లు క్యాతనపల్లి మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటనారాయణ తెలిపారు. మంచిర్యాలలో లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించకుండా ఉదయం 7.30 గంటలకే దుకాణం తెరిచినందుకు మ్యాక్స్‌ షాపింగ్‌ మాల్‌ యజమానికి రూ.10 వేలు, మాస్కులు ధరించకపోవడం, భౌతిక దూరం పాటించనందుకు ఫ్యాషన్‌హౌస్‌ బట్టల షాపు యజమానికి రూ.10 వేలు, కేటాయించని రోజున షాపు తెరిచినందుకు మహేంద్ర ట్రేడర్స్‌ యజమానికి రూ.3 వేలు ఫైన్‌ వేశారు. ప్లాస్టిక్‌ గ్లాసులు వాడినందుకు సోడా వ్యాపారి పోశం వద్ద రూ.500 కలిపి మొత్తం వ్యాపారుల నుంచి రూ.23,500 జరిమానా వసూలు చేశారు. మాస్కులు ధరించనందుకు దండేపల్లిలో ఒకరికి రూ.1000, పెద్దపేటలో మరొకరికి రూ.500 చొప్పున జరిమానా వేసినట్లు ఎస్‌ఐ శ్రీకాంత్‌ తెలిపారు. కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో మాస్కులు ధరించకుం డా బయట తిరుగుతున్న ఏడుగురికి రూ.1000 చొప్పున జరిమా నా వేసినట్లు ఎస్‌ఐ మధూకర్‌ తెలిపారు. కౌటాలలో ఐదుగురికి రూ.1000 చొప్పున ఫైన్‌ వేసినట్లు తహసీల్దార్‌ రాజేశ్వరి తెలిపారు.

తాజావార్తలు


logo