శనివారం 08 ఆగస్టు 2020
Komarambheem - May 12, 2020 , 01:41:15

కరోనా నివారణకు పకడ్బందీ చర్యలు

కరోనా నివారణకు పకడ్బందీ చర్యలు

  • జిల్లా అధికారులతో ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌

సీసీసీ నస్పూర్‌ : కరోనా నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ ఆదేశించారు. వైరస్‌ వ్యాప్తి నియంత్రణ, ధాన్యం కొనుగోళ్లు, రవాణా అంశాలపై సోమవారం సీసీసీ నస్పూర్‌ సింగరేణి అతిథి గృహంలో జిల్లా అధికారులతో సమీక్షించారు. ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, చిన్నయ్య, కలెక్టర్‌ భారతీ హోళికేరి, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. విప్‌ బాల్క సుమన్‌ మాట్లాడుతూ..  జిల్లాలో 1,261 మంది హోం క్వారంటైన్‌లో, ఏడుగురు ఐసోలేషన్‌ వార్డులో ఉన్నారని తెలిపారు. వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు లాక్‌డౌన్‌ నిబంధనలు కఠినంగా అమలు చేయాలన్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలన్నారు. ఇప్పటి వరకు 2.25 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రైస్‌ మిల్లులు, గోదాములు, ఖాళీగా ఉన్న ఫంక్షన్‌ హాళ్లకు తరలించినట్లు తెలిపారు. 22,280 మెట్రిక్‌ టన్నుల ధాన్యం వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసి.. 3,719 మంది రైతుల ఖాతాల్లో రూ.40.88 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు. కలెక్టర్‌ భారతీ హోళికేరి మాట్లాడుతూ ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వారి సమాచారాన్ని కలెక్టరేట్‌లోని కొవిడ్‌-19 కంట్రోల్‌ రూం నంబర్‌ 08736-250251కు ఫోన్‌ చేసి తెలుపాలని సూచించారు. పోలీసులు, రెవెన్యూ, వైద్యాధికారులు సమన్వయంతో ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.


logo