బుధవారం 02 డిసెంబర్ 2020
Komarambheem - May 11, 2020 , 02:51:37

అటవీ ఉత్పత్తుల మద్దతు ధర పెంపు

అటవీ ఉత్పత్తుల మద్దతు ధర పెంపు

  • అడవి బిడ్డలకు గిరిజన సహకార సంస్థ తీపికబురు

కుమ్రం భీం ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ: వేసవి కాలంలో అటవీ ఉత్పత్తుల సేకరణపై ఆధారపడి జీవించే అడవి బిడ్డలకు రాష్ట్ర గిరిజన సహకార సంస్థ తీపి కబురు అందిం చింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు అటవీ ఉత్పత్తుల మద్దతు ధర పెంచుతూ రాష్ట్ర గిరిజన సహకార సంస్థ ఎండీ క్రిస్టినా ఈనెల 8న ఆదేశాలు జారీ చేశారు. గతంతో పోల్చితే ఈ సారి ధరలు బాగానే పెంచారు. కొత్తగా నిర్దేశించిన ధరలు తక్షణం అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. ఏజెన్సీలో సేకరించే అటవీ ఉత్పత్తులను గిరిజన సహకార సంస్థ  కొనుగోలు చేస్తోంది. ఈ సీజన్‌లో ఐదు వేల క్వింటాళ్ల ఇప్పపూలు, 400 క్వింటాళ్ల తేనె సేకరించాలని జీసీసీ(గిరిజన సహకార సంస్థ) లక్ష్యంగా పెట్టుకుంది.