శుక్రవారం 14 ఆగస్టు 2020
Komarambheem - May 06, 2020 , 01:54:33

జోరుగా ధాన్యం కొనుగోళ్లు

జోరుగా ధాన్యం కొనుగోళ్లు

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 2,301 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని, 89.9 మెట్రిక్‌ టన్నుల మక్కజొన్నను ఇప్పటి వరకు అధికారులు కొనుగోలు చేశారు. జిల్లాలో 5,502 మంది రైతులు 12,352 హెక్టార్లలో వరి సాగు చేశారు. 30,880 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేసిన అధికారులు, ఇప్పటి వరకు 2,388.23 హెక్టార్లలో వరి కోతలు పూర్తయినట్లు గుర్తించారు. జిల్లావ్యాప్తంగా 25 కేంద్రాలను ఏర్పాటు చేసి, ఇప్పటివరకు 890 టోకెన్లను రైతులకు అందించారు. వీటి ద్వారా 2,301 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. 1,969 మెట్రిక్‌ టన్నుల ధాన్యానికి సంబంధించిన రూ.3.59 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు అదనపు కలెక్టర్‌ రాంబాబు తెలిపారు. జిల్లాలో 1,467 హెక్టార్లలో 980 మంది రైతులు మక్కజొన్న వేయగా, 3,667 మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. 


logo