‘బిగ్‌బాస్-4’ ఫేమ్ సయ్యద్ సొహెల్ కథానాయకుడిగా మైక్ మూవీస్ సంస్థలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. శ్రీనివాస్ వింజనంపాటి దర్శకుడు. అప్పిరెడ్డి, సజ్జల రవిరెడ్డి నిర్మాతలు. ఈ సినిమాలో రూప కొడువయూర్(‘ఉమమహేశ్వర ఉగ్రరూపస్య’ ఫేమ్) కథానాయికగా నటించనున్నట్లు సోమవారం చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు నాయకానాయికల కొత్త పోస్టర్‌ను విడుదలచేశారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘సమకాలీన సమాజంలో చర్చనీయాంశంగా మారిన ఓ ముఖ్యమైన పాయింట్‌ను తీసుకొని ఈ సినిమా చేస్తున్నాం. వెండితెరపై ఇప్పటివరకు రాని సరికొత్త కథాంశంతో రూపొందిస్తున్నాం. ప్రతి మహిళ గర్వపడేలా ఉంటుంది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, సినిమాటోగ్రఫీ: నిజార్ షఫీ.
ఇవి కూడా చదవండి:
ఈ సంతోషం కోసం మూడేళ్లు ఎదురుచూశాం!
తెలుగులో నిహారిక కొణిదెల నటించిన తమిళ చిత్రం
అండర్‌వరల్డ్ గ్రూప్ నేపథ్యంలో ‘శుక్ర’