సోమవారం 25 మే 2020
Komarambheem - Mar 10, 2020 , 02:21:18

గుడుంబా తయారీ దారులకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపిన సర్కారు

గుడుంబా తయారీ దారులకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపిన సర్కారు

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్న రాష్ట్ర స ర్కారు, పునరావాస పథకం ద్వారా గుడుంబా తయా రీ దారులకు ప్రత్యామ్నాయ మార్గం చూపి.. వారి స్వ యం ఉపాధికి బాటలు వేసింది. గుడుంబాను పూ ర్తిగా అరికట్టడమేగాకుండా తాగుడుకు బానిసవుతున్న నిరుపేద కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు చర్య లు తీసుకున్నది. జిల్లాలో 47 కుటుంబాలను గుర్తించిన అధికారులు, ఒక్కొక్క కుటుంబానికి రూ. 2 లక్ష ల చొప్పున ఆర్థిక సహాయం అందించి స్వయం ఉపాధిని కల్పించారు. తెలంగాణను గుడుంబా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ఉద్ధేశంతో రాష్ట్ర ప్రభుత్వం తయారీదారులపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించింది. జిల్లా అబ్కారీ శాఖ అధికారులు ఆ దిశగా చర్యలను ముమ్మరం చేసిన అధికారులు గుడుంబా తయా రు చేస్తున్న వారిపై నిఘా పెట్టి, గుడుంబా స్థావరాలను ధ్వంసం చేయడంతోపాటు, తయారీ దారులు, అమ్మేవారిపై కేసులు పెట్టి అరెస్టులు శారు. పలువురికి శిక్షలు పడ్డాయి. గుడుంబా తయారు చేస్తూ అరెస్టులు, జైలు శిక్షల సమయంలో తాము ఎలా బతకాలో చెప్పాలనీ.. ప్రత్నామ్నాయం చూపితే భవిష్యత్‌లో ఈ పనులు చేయమని తెలిపారు. ఈ విషయం ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి వెళ్లడం అందుకు అనుగుణమైన చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించడంతో ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. 


జీవన స్థితిగతులపై అధ్యయనం

గుడుంబా తయారీదారులు లేకుంటే .. అమ్మేవారు, తాగేవారు ఉండరని భావించిన అధికారులు ఆ దిశగా దృష్టి సారించారు. జిల్లా స్థాయిలో అబ్కారీ, రెవెన్యూ అధికారులు ఓ కమిటీగా, మండల స్థాయిలో ఎంపీడీఓలు, అబ్కారీ సీఐలు కమిటీగా ఏర్పడ్డారు. ముందుగా గుడుంబా తయారీదారులను గుర్తించారు. వారి జీవన స్థితిగతులపై అధ్యయనం చేశారు. వారిలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారిని ఎంపిక చేశారు. జిల్లాలో పూర్తిగా గుడుంబా తయారీపైనే ఆధారపడిన 73   కుటుంబాలు గుర్తించారు.వీరిలో 47 కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు.


ఆర్థిక సాయంతో అండగా..

గుడుంబా తయారీపైనే ఆధారపడి జీవిస్తూ.. ఆ దందాను ఇప్పుడు మానేసేందుకు సిద్ధపడిన కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించి చేయూతనిచ్చారు. ప్రస్తుతం ఈ కుటుంబాలు స్వయం ఉపాధి పొందుతూ ఆత్మగౌరవంగా జీవిస్తున్నారు. గుడుంబా తయారీని మానేసిన వారు ఏ రంగంలో ఉపాధి పొందాలనుకుంటున్నారో తెలుసుకొని ఆ మేరకు కార్యచరణ అమలు చేశారు. తొలి విడతలో గిరిజన సంక్షేమ శాఖ ద్వారా 47 మందికి రూ. 2 లక్షల చొప్పన రూ. 94 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. గొర్రెలను, ఆటోలను, కిరాణా, బట్టల దుకాణా లు, హోటల్‌, బోర్‌వెల్‌ మోటార్‌ పైప్‌లైన్‌ దుకా ణం, ఎడ్ల బండి, ఇలా లబ్ధిదారుల ఏది కోరుకుంటే దానికి అమలు చేశారు. 


ఆయా శాఖల ద్వారా చేయూత..

జిల్లాలో గుడుంబా తయారీ మానేసిన 47 కుటుంబాల్లో గిరిజన సంక్షేమ శాఖ ద్వారా 23 కుటుంబాలకు, ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా 11, బీసీ సంక్షేమ శాఖ ద్వారా 13, మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా ముగ్గురికి ఉపాధి కల్పించారు. గుడుంబా తయారీదారులుగా ఇన్నాళ్లు గ్రామాల్లో చిన్నచూపునకు గురైన ఆ కుటుంబాలు ఇప్పుడు సగర్వంగా తలెత్తుకునేలా ప్రభుత్వం చేయూతనిస్తోంది. ఇంతకాలం అందరికీ భయపడు తూ ఎవరేమంటోరనని ఆందోళనతో జీవించిన ఆ కుంటుబాలు ఇక ఆ వృత్తిని వదిలేసి సమాజంలో హుందాగా జీవిస్తున్నారు. ప్రభు త్వం అందించే ఆర్థిక సహాయంతో ఆటోలు, కిరాణ దుకాణాలు, హోటళ్లు, బట్టల దుకాణాలు, గొర్రెలు, ఫోటోస్టూడియోలు తదితర యూనిట్లతో ఉపాధి పొందుతున్నారు.


ప్రభుత్వ మేలుని మరువలేం..

చింతలమానేపల్లి: నాకు ఈ ప్రభుత్వం చేసిన మేలును జీవితంలో మర్చిపోను. నా భర్త గతంలోనే చనిపోయిండు. దీంతో కుటుంబ పోషణ కోసం కొన్నేళ్లు గుడుంబా తయారు చేసిన. పల్లెల్లో అమ్మి పిల్లలను పోషించుకున్న. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక, గుడుంబా తయారీపై నిఘా పెట్టింది. దీంతో కేసుల భయం పట్టుకుంది. ఉన్న ఉపాధి పొతదని రంది పట్టుకున్నది. కానీ పోలీసోళ్లు గుడుంబా తయారీ మానేస్తే, స్వయం ఉపాధికి దారి చూపుతుమని చెప్పిన్రు. ప్రభుత్వ సాయంతో ఆటోను కొని ఇచ్చిన్రు. ఆటోను కిరాయికి తిప్పుతూ, ఉపాధి పొందుతున్న. మమ్మల్ని కష్ట కాలంలో ఆదుకున్న ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారుకు రుణపడి ఉంటాం. గతంలో ఏ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించలేదు. ఇప్పుడు సమాజంలో గౌరవంగా బతుకుతున్న. నా కొడుకు, బిడ్డను మంచిగ చదివించుకుంటున్నరు. మమ్మల్ని ఆదుకునేందుకు ఏ సర్రాఉ ప్రయత్నించలే. కానీ సీఎం కేసీఆర్‌ వచ్చాకే అందరి బతుకులు బాగుపడుతున్నయి.    - సుశీల,లంబాడిహెట్టి


కుటుంబ పోషణకు ఆసరైంది..

రెబ్బెన: గుడుంబా తయారు చేయడం మానేసిన కుటుంబాలకు సర్కారు సాయం అందించింది. ఆ స్వయం ఉపాధి పథకంలో నాకు కూడా లబ్ధి చేకూరింది. తెలంగాణ సర్కారు నా కుటంబ పోషణ కోసం మేకలు అందించింది. చిన్న మేకపిల్లలు పెరిగి పెద్దవి కావడంతో నా కష్టం తీరింది. మేకల ద్వారా వస్తున్న ఆదాయంతో కుటుంబ పోషణకు చాలా వరకు ఆసరైంది. అనారోగ్యం బారిన పడి కొన్ని మేకలు చనిపోవడం నన్ను చాలా బాధకు గురి చేసింది. ఉన్న మేకలు పిల్లలు చేయడంతో చాలా సంతోషం వేసింది. మేకల పాలు ఇంటికి ఉపయోగ పడడంతో పాటు బయట అమ్మగా వస్తున్న డబ్బులతో ఆర్థిక ఇబ్బందులు కొంత మేర దూరమయ్యాయి. పెద్ద మేకలు సంతలో అమ్మగా, వచ్చిన డబ్బులు కుటుంబ పోషణ కు చాలా వరకు దోహడపడ్డాయి. ప్రస్తుతం చిన్నవి, పెద్దవి కలిపి దాదాపుగా 20 వరకు ఉన్నాయి. గతంలో గుడుంబా తయారు చేస్తున్న క్రమంలో చాలా ఇబ్బందులకు గురయ్యేవారం. ఎవరు వచ్చి దాడులు చేస్తారో అని టెన్షన్‌ ఉండేది. తయారీ ఆపినప్పటి నుంచి  ఆనందంగా ఉన్నాం. మమ్మల్ని ఆదుకున్న తెలంగాణ సర్కారుకు ధన్యవాదాలు. -అజ్మీర కిషన్‌, సింగల్‌గూడ


logo