మంగళవారం 31 మార్చి 2020
Komarambheem - Mar 10, 2020 , 02:19:59

రంగుల సంబురం

రంగుల సంబురం

సిర్పూర్‌(టి): మండలంలోని పలు గ్రా మాలతో పాటు మండల కేంద్రంలోని కొన్ని కాలనీల ప్రజలు హోలీ వేడుకలు నిర్వహించుకున్నారు. మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ, రైల్వే స్టేషన్‌ కాలనీ, డౌనల్‌ ఏరియా ల్లో యవకులు రంగులు చల్లుకొని వేడుక లు చేసుకున్నారు. 

కౌటాల: మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఆదివారం రాత్రి గ్రా మ పొలిమేర్లలో కామ దహనం చేసి ఇం టింటికీ వెళ్లి బూడిదను అందించారు. పెద్ద మ్మ ఆటల వాళ్లు పులి వేశ ధారణలతో ఆట లు ఆడారు. కౌటాల సీఐ శ్రీనివాస్‌, ఎస్‌ఐ ఆంజనేయులు, పలువురు ప్రజా ప్రతినిధు లు, అధికారులు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. 

పెంచికల్‌పేట్‌: మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో సోమవారం తెల్లవారు జామున కామ దహనం చేసి హోలీ పండుగను ఘనంగ జరుపుకున్నారు. సం బురాల్లో ఎస్‌ఐ రమేశ్‌ ఉన్నారు. 

చింతలమానేపల్లి: మండల కేంద్రంతో పాటు కర్జెవెల్లి, రవీంద్రనగర్‌, గంగాపూర్‌, బాబాసాగర్‌, తదితర గ్రామాల్లో హోలీ సం బురాలు జరుపుకున్నారు. ఒకరికొకరు శు భాకాంక్షలు తెలుపుకున్నారు. 

దహెగాం: మండల కేంద్రంతో పాటు వి విధ గ్రామాల్లో హోలీ వేడుకలు నిర్వహించారు. యువకులతో పాటు చిన్నారులు, మహిళలు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకు ని శుభాకాంక్షలు తెలుపుకోవడంతో పాటు వేడుకల్లో పాల్గొని ఉత్సాహంగా నిర్వహించుకున్నారు. 

కౌటాల రూరల్‌: పలు గ్రామాల్లో ప్రజ లు హోలి సంబురాలు చేసుకున్నారు. ఉద యం నుంచి చిన్నా, పెద్దా తేడా లేకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్నారు. అ నంతరం మండలంలోని తాటిపల్లి పెన్‌గం గా నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. 


logo
>>>>>>