శుక్రవారం 14 ఆగస్టు 2020
Komarambheem - Mar 10, 2020 , 02:19:28

రైతులకు భరోసా పీఎంకేఎంవై

రైతులకు భరోసా పీఎంకేఎంవై

వాంకిడి: రైతులు ఆరుగాలం  కష్టించి పంటలు సాగుచేసినా  వర్షాభవ పరిస్థితులతో ప్రకృతి వైపరీత్యాలతో తీవ్రంగా నష్ట పోతున్నారు. పంటలు పండక కొందరు, పండిన పంటలకు గి ట్టుబాటు ధరలేక మరికొందరు నష్టాలను చవిచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులను ఆ దుకోవటానికి కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాలు పలు రైతు సంక్షేమ ప థకాలను అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఏడాది క్రితం ప్రధానమంత్రి కిసాన్‌ మాన్‌ధన్‌ యోజన్‌ చిన్న, సన్నకారు రైతులకు పెన్షన్‌ పథకాన్ని ప్రవేశపెట్టింది. అర్హులైన రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటే ప్రయోజనం చేకూరుతుంది. ప్రస్తుతం ఈ ఏడాదిలో తమ వయస్సు ఆధారంగానే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం 60 ఏళ్లు దాటిన రైతులకు ప్రతి నెల రూ. 3 వేల పింఛన్‌ మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ మొత్తం ఎల్‌ఐసీ ద్వారా అందజేస్తుంది. కేంద్ర ప్ర భుత్వం అమలు చేస్తున్న ఈ పథకం కింద రైతులు లబ్ధి పొందడానికి నిబంధనల ప్రకారం దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. వ్యవసాయశాఖ అధికారులు మండలంలోని వివిధ గ్రామాల్లో దీని పై రైతులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 

అనర్హులు వీరే..

చిన్న, సన్నకారు రైతులు చట్టబద్దమైన సామాజిక భద్రత పథకాల్లో ఉన్నవారు, రాష్ట్ర ఉద్యోగ బీమా పథకం, ఎంప్లాయిడ్‌ ఫండ్‌, ఆర్గనైజేషన్‌ స్కీంలలో ఉన్నవారు అనర్హులు.

ప్రధానమంత్రి శ్రమ్‌యోగి మాన్‌ధన్‌ యోజన పథకంలో ఉన్న రైతులు అనర్హులు.

సంస్థాగత భూములు కలిగిన వారు. రైతు కుటుంబంలో ఎవరైనా గతంలో లేదా ప్రస్తుతం రాజ్యంగ పదవిలో ఉన్నవారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు. మల్టీ టాస్కింగ్‌ క్లాస్‌4, గ్రూప్‌ డీ ఉద్యోగులకు మినహాయింపు.

రూ, 10 వేలు పైన పింఛన్‌ తీసుకునే రిటైర్డ్‌ పింఛన్‌దారులు.

ఆదాయ పన్నులు చెల్లించే వారంతా గతేడాది ఆధారంగా..

వృత్తి ఉద్యోగులు, డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్లు, సీఏలు, రిజిస్టర్‌, ఆర్కిటెక్‌లు అనర్హులు.

నింబంధనలు ఇవీ.

ఐదెకరాల్లోపు వ్యవసాయ భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతులు ఈ పథకానికి అర్హులు.

18 నుంచి 40 ఏళ్లలోపు వయస్సు కలిగి ఉండాలి.

భార్యాభర్తలు విడివిడిగా రైతు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హులైన రైతులు ప్రతి నెల రూ. 55 నుంచి రూ, 200 వరకూ ప్రీమియం చెల్లించాలి.

రైతులు ప్రతి నెల చెల్లించే ప్రీమియంతో సమానంగా కేంద్రం తన వాటాను చెల్లిస్తోంది.

దరఖాస్తు చేసుకున్న రైతులు 60 ఏళ్లకు ముందుగానే మరణిస్తే చెల్లించిన మొత్తం వడ్డీతో సహా చెల్లిస్తారు.

భార్య చనిపోతే భర్తకు, భర్త చనిపోతే భార్యకు దీన్ని వర్తింపజేస్తారు.

రైతులు తమ వివరాలను కామన్‌ సర్వీస్‌ సెంటర్లు, మీ సేవ కేంద్రాల్లో నమోదు చేసుకోవచ్చు.

తాజావార్తలు


logo