శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Komarambheem - Mar 10, 2020 , 02:18:49

వెనుకబడిన విద్యార్థినులపై శ్రద్ధ

వెనుకబడిన విద్యార్థినులపై శ్రద్ధ

సిర్పూర్‌(టి): బాలికా విద్యకు భరోసాని చ్చేందుకు ప్రభుత్వం కస్తూర్బా విద్యాల యాలను ఏర్పాటు చేసింది. సకల సౌకర్యాలతో అనుభవజ్ఞులైన ఉపా ధ్యాయ సిబ్బందితో బోధననందిస్తోంది. ప్రస్తుతం పదో తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తుండడంతో , వారిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. సిర్పూర్‌ (టి) మండల కేంద్రంలోని   కేజీబీవీలో పదో తరగతి విద్యార్థులకు నిత్యం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఉద యం, సాయంత్రం ఈ తరగతులు నిర్వహిస్తున్నా రు.  వంద శాతం ఫలితాలు సాధించేందుకు పక్కా ప్రణాళికతో పాఠశాల ప్రత్యేకాధికారి, ఉపాధ్యాయులు ముందుకెళ్తు న్నారు. ప్రతి రోజు ఉదయం 5 గంటల నుంచి 7:30 గంటల వరకు, సాయంత్రం 5గంటల నుంచి 7 గంటల వరకు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. విద్యాల యంలో 37 మంది పదో తరగతి విద్యన భ్యసిస్తున్నారు. ప్రత్యేకంగా వీరికి సౌకర్యా లు కల్పించి, సరిపడా ఉపాధ్యాయులను నియమించి తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.  ప్రతి నెలా సంపూర్ణ విద్యా వి కాస కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. చదువులో వెనుకబడి ఉన్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపు తున్నారు. అన్ని సబ్జెక్టులను వారికి అర్థమయ్యేలా బోధిస్తూ, వారి సందేహాలను నివృత్తి చేస్తు న్నారు.  గతేడాది వార్షిక పరీక్షల్లో 84 శా తం ఉత్తీర్ణత శాతం రాగా, ఈ సారి 100 శాతం ఉత్తీర్ణత సాధించేందుకు ప్రత్యేకాధికారి నాగసూధ ఆధ్వర్యంలో సిబ్బంది వి ద్యార్థులను సన్నద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా పిల్లలం టే పరీక్షల ఫీవర్‌ను పొగేట్టే ప్రయత్నం చేస్తున్నారు. పరీక్షా కేంద్రంలో సమయం వృథా కాకుండా తీసుకో వాల్సిన జాగ్రత్తలను వారికి ముందుగానే వివరించా రు. చేతిరాతతో పాటు ముందుగా తెలిసిన ప్రశ్నలకు సమాధానాలు రాయాలనీ, భయాందోళనను వీడా లని విద్యార్థినులకు తరగతుల్లో చెప్పారు.


ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి..

ఈ విద్యాసంవత్సరం పది ఫలి తాల్లో వంద శాతం ఉత్తీర్ణత సా ధించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. ఇందుకో సం విద్యార్థులకు ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ప్రత్యే క తరగతులను నిర్వహిస్తు న్నాం. సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, వారిపై ప్రత్యేక దృష్టి సారించాం. వి ద్యార్థులకు పరీక్షలంటే భయం తొలగించేందుకు వారిని మోటివే షన్‌ చేసి, వారిలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తున్నాం.. గతేడాది 84 శాతం ఫలితాలు రాగా, ఈసారి వంద శాతం సాధించే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం.

-నాగసుధ, ప్రత్యేకాధికారి


కష్టపడి చదువుతున్నాం

పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో ప్రణా ళికతో చదువుకుంటున్నాం. సమయం వృథా చేయకుండా కష్టపడి చదువుకుం టున్నాం. ఉపాధ్యాయులు చెప్పిన పా ఠాలను చదివి, నోట్స్‌ను తయారు చేసు కుంటున్నాం. ప్రతి సబ్జెక్టుకు సరిపడా సమ యాన్ని కేటాయించి, పక్కా ప్రణాళిక ప్రకారం చదువుతున్న. ఉపాధ్యా యులు మాపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నరు. మా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మంచి మార్కులు సాధిస్తాం. మాకు తెలియని విషయాలను మా టీచర్లను అడిగి తెలుసు కుంటున్నాం. వారు కూడా మా సందేహాలను ఓపికగా చెబుతు న్నారు. ప్రశ్నకు సమాధానం రాసే విధానం, చేతిరాత, ప్రశ్న పత్రంలో ముందుగా తెలిసిన విషయాలపై దృష్టి పెట్టి, సమాధానాలు రాయాలని చెబుతున్నారు.

-డీ శిరీష, పదో తరగతి


తాజావార్తలు


logo