శనివారం 15 ఆగస్టు 2020
Komarambheem - Mar 10, 2020 , 02:11:46

ఈదురు గాలులు.. వర్షం

ఈదురు గాలులు.. వర్షం

సిర్పూర్‌ (టి)/ కౌటాల/ వాంకిడి/ చింతలమానెపల్లి: జిల్లాలో సోమవారం తేలికపాటి వ ర్షాలు కురిశాయి. వర్షాలకు తోడు ఈదురుగాలలు వీయడంతో శనగపంటకు కొద్దిపాటి నష్టం వాటిల్లింది. సిర్పూర్‌-టిలో 18.7 మిల్లీ మీటర్లు, వాంకిడి 4.5, కౌటాల 26.0, చింతలమాపెల్లి 19.0, బెజ్జూర్‌ 1.0 మీల్లీ మీటర్ల వర్షంకురిసింది. జిల్లా లో కురుస్తున అకాల వర్షలతో మామిడి పంటకు నష్టం కలుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. సిర్పూర్‌(టి) మండల కేంద్రంలో బ స్టాండ్‌ ఆవరణలో రహదారిపై వరదనీరు వచ్చి చేరింది. అంగడిబజార్‌ కాలనీలో ముంపు ప్రాం తాలను తాసిల్దార్‌ లింగమూర్తి పరిశీలించారు. ఆయన వెంట ఆర్‌ఐ జాఫర్‌, వీఆర్వో రామారావు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. కౌటాలలో   గాలితో కూడిన వర్షం కురిసింది. దీంతో శనగ, పెసర, మొక్కజొన్న, మిరప పంట పొలాల్లోనే తడిసింది. పలు గ్రామాల్లో చెట్లు విరిగి విద్యుత్‌ స్తంభాలపై పడడంతో  సరఫరా నిలిచిపోయింది. వాంకిడిలో అరగంట వర్షం కురిసింది. ఎలాంటి ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. చింతలమానేపల్లి మండల కేంద్రంతో పాటు ర వీంద్రనగర్‌, బాలాజీ అన్‌కోడ, బాబాసాగర్‌, గం గాపూర్‌తో పాటు పలు గ్రామాల్లో సోమవారం మూడు గంటల పాటు గాలివాన కురిసింది. దీం తో మొక్కజొన్న పంట నేల వాలింది. 


logo